తెలంగాణలో దళితులపై పెరుగుతున్న దాడులు..హత్యలు..

తెలంగాణలో దళితులపై పెరుగుతున్న దాడులు..హత్యలు..
  • నిధుల కేటాయింపుల్లో భారీ కోతలు
  • దారి మళ్లుతున్న సబ్ప్లాన్ నిధులు
  • పేరుకే భూ పంపిణీ స్కీం
  • ఆరేండ్లలో పంచింది ఆరువేల మందికే
  • ఎస్సీకార్పొరేషన్లోన్స్ అంతంతే
  • ఫ్రీ కరెంట్’ నిధుల్లో కటింగ్స్ 

‘కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో దళితులు దగా పడుతున్నారు. వారిపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లీడర్లు గుంజుకుపోతున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తున్నారు. దళితుడినే తెలంగాణ రాష్ట్ర తొలి సీఎంను చేస్తామని ఉద్యమ టైంలో చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. భూమిలేని ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమిని పంచుతామని చెప్పిన ప్రభుత్వం.. ఆరు వేల మందికి మాత్రమే పంచి చేతులెత్తే సింది. దళితుల అభివృద్ధి కి కేటాయించే నిధుల్లో కోతల మీద కోతలు పెడుతోంది. సబ్ప్లాన్ నిధులు దారిమళ్లిస్తోంది. అటు నెల రోజుల్లో నే రాష్ట్రంలో వివిధ చోట్లముగ్గురు ఎస్సీలపై దారుణ ఘటనలు జరిగాయి. భూపాలపల్లి జిల్లాలో రేవెల్లి రాజబాబు, మహబూబ్ నగర్జిల్లాలో గుర్రంకాడి నర్సింహులు హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనల వెనుక అధికార పార్టీనేతలు, వారి అనుచరుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ కు చెందిన బ్యాగరి నర్సింలు.. తన భూమిని రైతు వేదిక కోసం గుంజుకున్నారన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు . ఆరేండ్లుగా రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సగటున రోజుకు 4 దాడుల కేసులు, వారంలో మూడు రేప్ కేసులు నమోదవుతున్నాయి.

30, 40 ఏండ్లుగా ఈ భూముల్నే నమ్ముకున్నం. నోటికాడి కూడులాక్కోవద్దు సారూ..’ అంటూ పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న వీళ్లు నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామ దళిత రైతులు. వారు ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను హరితహారం మొక్కలు నాటాలంటూ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. దీంతో రైతులు ఇలా వేడుకున్నారు.

మూడెకరాల ముచ్చట కాటగల్సింది

‘దళితులకు మూడెకరాల భూ పంపిణీ’ స్కీంకు బ్రేకులు పడ్డాయి.రాష్ట్రం ఏర్పడిన కొత్తలోదీనిపై హడావుడి చేసిన ప్రభుత్వం.. తర్వాత ఆ ఊసెత్తడంలేదు. భూమిలేని ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాలు పంపిణీ చేస్తామని అప్పట్లో సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో భూమి లేని దళిత కుటుంబాలు దాదాపు 3 లక్షలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. అయితే.. 2014 నుంచి ఇప్పటి వరకు భూ పంపిణీ కోసం దాదాపు రూ. 663 కోట్లు ఖర్చు చేసి 16,418 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేసింది. అది కూడా ఆరు వేల మందికే పంచి చేతులు దులుపుకుంది. ప్రభుత్వ భూములు లేవని, భూ కొనుగోలు కోసం అధిక ఖర్చు అవుతోందని సాకుతో స్కీం నుంచి తప్పుకొందన్న విమర్శలు ఉన్నాయి.

రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయి. వారికిచ్చిన హామీలు అమలు కావడం లేదు. కేటాయించే నిధులు దారి మళ్లుతున్నాయి. రాష్ట్రజనాభాలో ఎస్సీలు 16 శాతం ఉన్నారు. మొత్తం నిధుల్లో 16 శాతం ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కానీ కేటాయింపుల్లో సరిగ్గానే చూపిస్తూ.. ఖర్చుల్లో మాత్రం ప్రభుత్వం తిరకాసుపెడుతోంది. దళితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భూ పంపిణీ స్కీం అటకెక్కింది . దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ గతంలో దళిత నేతలు, మేధావులను ప్రగతిభవన్కు పిలిచి సీఎం కేసీఆర్ ఎన్నో హా మీలు ఇచ్చారు. అవన్నీ ఉత్త మాటలయ్యాయని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హామీలు అమలుకు నోచుకోక పోగా.. రోజు రోజుకు వారిపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. దళితులు సాగు చేసుకుంటున్న భూములను లీడర్లు కబ్జా పెడుతున్నారు. అడ్డువస్తేప్రాణాలు తీస్తున్నారు. వాగులో నుంచి ఇసుక తీసుకపోవద్దని, తీసుకపోతే తమ ఎవుసం ఆగమవుతుందని ఇటీవల మహబూబ్ నగర్లో ఓ దళిత రైతు అడ్డుకోబోతే.. ఇసుక మాఫియా అతడి ప్రాణాలు తీసింది. తన భూమిని రైతు వేదిక కోసంగుంజుకున్నారన్నబాధతో సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఓ దళిత రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లవుతున్నా.. ఇటు రాజకీయంగా, అటు సామాజికంగా దళితులు దగాపడుతూనే ఉన్నారు.

తగ్గిన ఎస్సీ కార్పొరేషన్ లోన్స్

సెల్ప్ ఎంప్లాయీమెంట్ స్కీంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ కింద ఇచ్చేసబ్సిడీ లోన్లుతగ్గిం చేశారు. ఎస్సీ యూత్ను ఆర్కథి ంగా బలోపేతం చేసేందుకు ఈ స్కీం తీసుకువచ్చారు. వ్యాపారం చేసుకునేందుకు, కార్లు, ట్రాక్టర్లు కొనుక్కునేందుకు లోన్లు ఇస్తుంటారు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఈ స్కీం కింద వేలాది సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ 2019–20 ఫైనాన్స్ఇయర్లో లబ్ధిదారుల సంఖ్య 4 వేలు కూడా దాటలేదు. లోన్ కోసం అప్లైచేసుకున వాళ్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా లోన్లు ఇస్తలేరు.

సంచలనం రేపిన కేసులు

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట దళితులపై లీడర్లు, వారి అనుచరులు దాడులకు దిగుతున్నారు. గత నెల 30న సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. రైతు వేదిక నిర్మాణం కోసం 1.13 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్న ఆవేదనతో వేలూరులో బైగరి నర్సింలు అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల కింద భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామంలో నిరుపేద దళితుడు రేవెల్లిరాజబాబు హత్య జరిగింది. ఈ హత్యను టీఆర్ఎస్ కార్యకర్తలే చేశారన్న ఆరోపణలు వచ్చాయి. నింది తులను శిక్షించాలని డిమాండ్ చేస్తూకాంగ్రెస్ పార్టీ‘చలో మల్లారం’ పిలుపు నిచ్చింది. మల్లారానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్చేశారు. రాజబాబు హత్యపై నిజా నిజాలు తెలుసుకునేందుకు బీజేపీ నేతలు మల్లారం బయలుదేరగా.. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.

కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. 2017 జులైలో సిరిసిల్లనియోజకవర్గం నేరెళ్లగ్రామంలో జరిగిన ఇసుక మాఫియా ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది . అప్పట్లోఊర్ల మధ్యనుంచి ఇసుక లారీల రాకపోకల వల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. జులై 2న బి. భూమయ్య అనే వ్యక్తి ఇసుకలారీ ఢీకొని మరణించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ స్థానికులు ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ కేసులో 8 మంది దళితులపై పోలీసులు కేసులు పెట్టిహింసించారు. నేరెళ్లఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఆందోళనకు దిగారు. గత నెల 30న మహబూబ్నగర్ జిల్లా తిర్మలాపూర్లో అక్రమంగా ఇసుక ను తరలిస్తున్న మాఫియాను నర్సింహులు అనే దళి త రైతు అడ్డుకోబోగా.. లారీతో తొక్కించి చంపేశారు. దీనిపై ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ కేసును యాక్సిడెంట్ కేసుగా మార్చడం అనేక అనుమానాలకు కారణమైంది.

ఎస్డీ ఎఫ్ ఫండ్స్ డైవర్షన్

ఏటా ఎస్సీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద కేటాయించే నిధుల్లో సగం దారి మళ్లుతున్నాయి. దీనిపై ఎస్సీ సంఘాలు, మేధావులు ప్రభుత్వ పెద్దలకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. ఎలాంటి మార్పు లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు సగం నిధులు డైవర్షన్ అయినట్టు ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ మానిటరింగ్ కమిటీ గుర్తించింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు కు లేఖ కూడా రాసింది. 2014- 2019 వరకు ఎస్డీఎఫ్ కింద రూ. 69,479 కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ. 40,039 కోట్లు ఖర్చు చేశారు. మిగతా రూ. 29,440 కోట్ల ను దారి మళ్లించినట్టు లేఖలో కమిటీ పేర్కొంది.

ఫ్రీ కరెంట్ స్కీమ్కు నిధులు కట్

ఎస్సీలకుఫ్రీగృహవిద్యుత్ స్కీం పూర్తి స్థాయిలోఅమలవట్లేదు.ప్రతినెల101 యూనిట్లకరెంట్కాల్చే ఎస్సీలకు ఈ స్కీం కింద ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుంది. తొలుత దీనిపై ఇంట్రస్ట్ పెట్టిన రాష్ట్ర సర్కారు..తర్వాత తక్కువపైసలు విడుదల చేస్తోంది. 2014–-15లో రూ. 14,53,952 విడుదల చేసిన ప్రభుత్వం..2015-–16లోరూ. 2,84,422, 2016–-17లో రూ.1,10,712 , 2017–-18లో రూ. 1,40,718, 2018-–19లో రూ.1,01,475 మాత్రమే విడుదల చేసింది.