
కోలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరైన విజయ్ సినిమాలో అవకాశం అంటే ఏ హీరోయిన్ మాత్రం నో అంటుం ది. కానీ టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీలీల మాత్రం నో చెప్పేసింది. అందుకు కారణం లేకపోలేదు. వివరాల్లోకి వెళితే.. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గోట్’. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడంతో తన కెరీర్‌లో ఇదే చివరి చిత్రం అనే ప్రచారం జరుగుతోంది. దీంతో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించారట. అయితే ఈ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తిరస్కరించిందట. అజిత్ సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదే టైమ్‌లో ఈ ఆఫర్ వచ్చింది. ఐటం సాంగ్‌తో ఎంట్రీ ఇవ్వడం కంటే హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అవడం ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుంది. అదీకాక గతంలో పలు ఇంటర్వ్యూస్ లో స్పెషల్ సాంగ్స్ చేయనని చెప్పిందామె. మరి అలాంటి పాటలు చేసే ఆసక్తి లేకనో, లేదా కెరీర్‌లో బెటర్‌మెంట్ కోసమో అనేది శ్రీలీలకే తెలియాలి. అయితే ధమాకా, గుంటూరు కారం లాంటి చిత్రాల్లో ఆమె డ్యాన్సులు చూసి స్పెషల్ సాంగ్‌లో ఆమెను ఊహించుకున్న తమిళ అభిమానులకు మాత్రం ప్రస్తుతానికి నిరాశ తప్పలేదు!