మేడారంలో భక్తుల రద్దీ

మేడారంలో భక్తుల రద్దీ

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, జార్ఖండ్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. 

అనంతరం గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు కోళ్లు, మేకలను బలిచ్చి అమ్మవార్లకు నైవేధ్యం సమర్పించిన అనంతరం కుటుంబసమేతంగా వనభోజనాలు చేశారు. రద్దీ కారణంగా ట్రాఫిక్‌‌‌‌ సమస్య తలెత్తకుండా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్త్‌‌‌‌ ఏర్పాటు చేశారు.