ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 24.
పోస్టులు: 20
పోస్టుల సంఖ్య: డిప్లొమా అప్రెంటీస్ 10, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 10.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీసీఏ, బీబీఏ, బి.కాం, బీఎస్సీ, బి.టెక్/ బీఈ, డిప్లొమాలో ఉతీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 27 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 24.
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రెండో ఫేజ్లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మూడో ఫేజ్లో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
పూర్తి వివరాలకు aai.aero వెబ్సైట్లో సంప్రదించగలరు.
►ALSO READ | HLLలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. బీఎస్సీ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..
