ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాని ముప్పు కూడా అంతేస్థాయిలో పెరుగుతుంది. ఇటీవల తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆందోళన వ్యక్తం చేసింది. తనపై, తన కుటుంబంపై కావాలని ఒక సోషల్ మీడియా అకౌంట్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని, తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తుందని కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు అనుపమ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అనుపమ కంప్లైంట్ను స్వీకరించిన పోలీసులు.. ఆ వెంటనే విచారణ జరిపి ఎవరనేది కనిపెట్టారు.
అయితే, ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు.. తమిళనాడుకు చెందిన ఒక 20 ఏళ్ల అమ్మాయి అని తేలింది. ఇప్పటికే, ఎంతోమంది హీరోయిన్స్ డీప్ ఫేక్ బారిన పడ్డారు. అందులో చాలా వరకు మార్ఫింగ్ చేసింది అబ్బాయిలే. కానీ, ఇపుడు అనుపమ ఫోటోలను ఎడిట్ చేసి, తనకు ఇష్టం వచ్చినట్టు వికృతంగా మార్చి వేధిస్తున్నది ఒక అమ్మాయి అవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులు విచారణ లోతుగా చేయగా.. ఇలా కొంత మంది అమ్మాయిలు సైతం హీరోయిన్లను వేధిస్తున్నారని బయటపడింది.
►ALSO READ | Chandrika Ravi: ఈ వీరసింహారెడ్డి బ్యూటీ గుర్తుందా.? పాపం.. ఒకేసారి రెండు సంఘటనలు
‘‘కొన్ని రోజుల క్రితం నా దృష్టికి ఒక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ వచ్చింది. అందులో నా గురించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా నా ఫ్రెండ్స్ మరియు నా సహా నటీనటులను ట్యాగ్ చేస్తున్నారు. ఆ అకౌంట్ నుంచి వచ్చే పోస్టుల్లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు కొన్ని ఉన్నాయి.
అలాగే, నిరాధారమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలా లక్ష్యంగా చేసుకొని వేధింపులు చేయటం చాలా బాధాకరం. మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి పని కట్టుకుని కావాలని నన్ను టార్గెట్ చేశారని అర్థమైంది. సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలా ఫేక్ అకౌంట్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు.
నేను చేసే ప్రతి పోస్ట్ కింద కామెంట్ కనబడుతోంది. అది తెలిసిన తరువాత నేను కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్ళు ఫాస్ట్ గా స్పందించి ఇలా చేసే వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి నన్ను టార్గెట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని తన ఐడెంటిటీ రివ్యూ చేయాలని అనుకోవడం లేదు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది.
నేను ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, చేతిలో స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు. ఇతరులను వేధించే, పరువు తీసే, ద్వేషాన్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ ఉండదు. ఆన్‌లైన్‌లో చేసే ప్రతిదీ ట్రాక్ అవుతుంది. మేం చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. నటీనటులకు సైతం సామాన్యులకు ఉండే హక్కులు ఉంటాయి’’ అని అనుపమ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
సాధారణంగా 1997 నుండి 2012 మధ్య పుట్టిన వారిని 'జెన్ Z' వయసున్న వారని పిలుస్తారు. అందువల్ల.. ఒక 20 ఏళ్ల అమ్మాయి ఇలా బరితెగించి, సినీ నటులను వేధించడంతో.. ఇండస్ట్రీతో పాటుగా నెటిజన్లను షాక్కి గురిచేసింది.
నిజానికి, ఇటీవల కాలంలో రష్మిక మందన్న వంటి ఇతర నటీమణులు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీ బారిన పడ్డారు. దీనిపై సెలబ్రిటీలు, సైబర్ నిపుణుల నుంచి ఆందోళన పెరుగుతోంది.సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
