Chandrika Ravi: ఈ వీరసింహారెడ్డి బ్యూటీ గుర్తుందా.? పాపం.. ఒకేసారి రెండు సంఘటనలు

Chandrika Ravi: ఈ వీరసింహారెడ్డి బ్యూటీ గుర్తుందా.? పాపం.. ఒకేసారి రెండు సంఘటనలు

ప్రతి ఒక్కరి లైఫ్​ మరొకరికి స్ఫూర్తి అవుతుంది. మనం ఉండే పద్ధతి, చేసే పని అందరికీ నచ్చకపోయినా మనల్ని అభిమానించేవాళ్లూ కొందరు ఉంటారు. చంద్రిక రవి (Chandrika Ravi).. జర్నీ కూడా అలాంటిదే. పరాయి దేశంలో పుట్టిపెరిగిన ప్రవాసీ.. తను అనుకున్న లైఫ్​ అక్కడ లేదని తిరిగి మనదేశానికి వచ్చిన దక్షిణాది అమ్మాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒక మెట్టుగా మలచుకుంటూ చిన్న చిన్న పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసే స్థాయి నుంచి.. లీడ్ రోల్స్​ వరకు ఆమె జర్నీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయి. లేటెస్ట్​గా ‘బ్లాక్​ మెయిల్​’ సినిమాలోనూ స్పెషల్ సాంగ్​లో కనిపించింది. ప్రస్తుతం ‘సిల్క్ స్మిత’ బయోపిక్​లో సిల్క్ స్మితగా కనిపించబోతున్న చంద్రిక గురించి...

చంద్రిక రవి.. మెల్​బోర్న్​కు చెందిన రవి  శ్రీధరన్​, మాలిక దంపతుల కూతురు. మూడేళ్ల వయసు నుంచే చంద్రిక డాన్స్, యాక్టింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. పదహారేండ్లకు తన ప్రొఫెషనల్ జర్నీని స్టార్ట్ చేసింది. మొదట నాటకాల గ్రూప్​లో చేరింది. తర్వాత సినిమాలు, టీవీ షోల్లో కనిపించింది.

అంతేకాదు.. చంద్రిక 2012లో మిస్​ మాగ్జిమ్​ ఇండియా టైటిల్​ రన్నరప్​గా నిలిచింది. అదే ఏడాది మిస్ వరల్డ్​ ఆస్ట్రేలియా టైటిల్​ పోటీలో పాల్గొని స్టేట్​ ఫైనలిస్ట్​ అయింది. ఆ స్థాయికి చేరుకున్న మొదటి ఇండియన్​ చంద్రికే. ఆ తర్వాత మిస్​ ఇండియా ఆస్ట్రేలియా పోటీల్లోనూ పార్టిసిపేట్ చేసింది. 

ఫిల్మ్ కెరీర్​

ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఈ సౌత్​ ఇండియన్ అమ్మాయి.. తమిళంలో ‘సెయి’ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2017లో రిలీజ్ అయిన ఆ సినిమా సరైన సక్సెస్​ ఇవ్వకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ‘ఇరుట్టు ఆరయిల్​ మురట్టు కుత్తు’ అనే మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఆమె దెయ్యం పాత్రలో నటించింది.

అదే సినిమా తెలుగులో రీమేక్​ చేయగా అందులో స్పెషల్‌ సాంగ్‌​లో కనిపించింది. దాని తర్వాత ఒకవైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరికొన్ని ప్రాజెక్ట్స్​లో గెస్ట్​ రోల్​లో కనిపించేందుకు ఒప్పుకుంది. వాటిలో తెలుగులో ‘వీర సింహా రెడ్డి’, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలలో ఆమె గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం ‘సిల్క్ స్మిత’ బయోపిక్​లో టైటిల్​ రోల్​ పోషిస్తోంది. లేటెస్ట్​గా వచ్చిన ‘బ్లాక్​ మెయిల్’ అనే సినిమాలో మరోసారి అలరించింది.

ఒకేసారి రెండు సంఘటనలు

విడాకులు అయిన ఆరు నెలల తర్వాత ఆమెకు సర్వైకల్ క్యాన్సర్​ ఉందని బయటపడింది. ఆ విషయం వాళ్ల తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు ఎంతో బాధపడ్డారు. అప్పటికే విడాకుల వల్ల ఆమె కుంగిపోయి ఉంది. అంతలోనే మరో బ్యాడ్​​ న్యూస్ తెలియడంతో షాక్​కి గురయ్యారు. అదే ఏడాదిలో చంద్రిక వాళ్ల నానమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్​ ఉందని తెలిసింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చంద్రికను మానసికంగా కృంగదీశాయి.

►ALSO READ | PSYCH SIDDHARTH Teaser: బూతులతో నిండిపోయిన ‘సైక్ సిద్ధార్థ’.. సింగర్ గీతా మాధురి భర్త, నందు రెచ్చిపోయాడంతే!

దాని గురించి చెప్తూ ‘‘అప్పుడు మా పేరెంట్స్ ట్రీట్​మెంట్ కోసం నన్ను ఆస్ట్రేలియా రమ్మని బతిమిలాడారు. నేను ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ధైర్యాన్నిచ్చారు. ఈ ట్రామా నుంచి నేను నేచురల్​గా కోలుకుని ముందుకు సాగిపోవాలి అన్నప్పుడు నాకు అర్థం అయింది ఏంటంటే.. మన హెల్త్​ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఒత్తిడి అనేది మన బాడీకి అస్సలు మంచిది కాదు అని” అంది. క్యాన్సర్​తో పోరాడి ఈ రోజు సంతోషంగా, సక్సెస్​ఫుల్​గా కెరీర్​ కొనసాగిస్తోంది చంద్రిక. 

మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్

‘‘మన లైఫ్​లో ఎన్నో ఆశలు, ఆశయాల కోసం పరుగెడుతూ ఉంటాం. అయితే, ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. వాటి నుంచి బయటపడడం చాలా కష్టమైంది. అప్పుడు నేను నా మెంటల్ హెల్త్​ మీద ఫోకస్ చేశా. అది నా జీవితాన్ని మార్చేసింది. బతకడానికి ఎంతో ధైర్యాన్నిచ్చింది.

మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి యుద్ధంలోనైనా విజేత కాగలమని అర్థం అయింది. చూసేవాళ్లకు నేను ఎన్ని రకాల ప్రాబ్లమ్స్, చాలెంజెస్​ ఫేస్​ చేస్తున్నానో తెలియదు. కానీ వాళ్లకు నచ్చినట్లు జడ్జ్ చేసి మాట్లాడేవాళ్లు. అవి ఇంకా బాధగా అనిపిస్తాయి. కానీ, అలాంటివన్నీ పట్టుకుని కూర్చుంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. అందుకే అలాంటివన్నీ పట్టించు కోకుండా మనం ముందుకుసాగాలి’’ అని నా లైఫ్‌ రీస్టార్ట్‌ చేశా. 

అందుకే ఇండియాకొచ్చా

‘‘సినిమాలంటే నాకు మహా ఇష్టం. నటించాలనే కోరికతో మనదేశానికి గానీ, లాస్​ ఏంజెలిస్​కు గానీ షిఫ్ట్ అవ్వాలనుకున్నా. అనుకున్నట్లే ముందు లాస్​ ఏంజెలిస్​కు వెళ్లా. న్యూయార్క్​ ఫిల్మ్​ అకాడమీలో డిప్లొమా చేశా. తర్వాత అక్కడ టెలివిజన్​ షోలు, వెబ్​ షోస్​ హోస్ట్ చేశా. పరాయి దేశంలో టాక్​ షోలు హోస్ట్ చేసిన మొదటి భారతీయురాలిని. కుకింగ్​ షోతో సహా మరికొన్ని షోలకు రైటింగ్, డైరెక్షన్​ చేశా. నేను ఎదిగే క్రమంలో ఇన్ని రకాల పాత్రలు పోషించానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది.’’

గత పదేండ్ల నుంచి ఇండియా, లాస్​ ఏంజెలిస్​మధ్య తిరుగుతూ ఉన్నా. వీర సింహారెడ్డి సినిమాలో స్పెషల్ సాంగ్​ కోసం డైరెక్టర్ ఫోన్​ చేయగానే వెంటనే లాస్ ఏంజెలిస్​ నుంచి హైదరాబాద్​కు వచ్చేశా. డైరెక్ట్​గా సెట్​కు వెళ్లిపోయి ఐదే ఐదు రోజుల్లో పాట షూటింగ్​ పూర్తి చేసుకున్నా. అది రిలీజ్​ అయ్యాక ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎప్పటికీ మర్చిపోలేను.

ఇండియాకు వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడి భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. నిజానికి ఇక్కడి కల్చర్ గురించి నేను అనుకున్నదానికంటే ఎక్కువ అర్థం చేసుకున్నా. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. నేను పేరుకు మాత్రమే ఆస్ట్రేలియన్​–ఇండియన్ అమ్మాయిని. కానీ.. మా అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచి నాకు శ్లోకాలు నేర్పించారు.

నేను ఏ మంత్రాన్ని అయినా చదవగలను. పట్టు చీరలు కట్టుకుంటాను. బీచ్​కి వెళ్తే దానికి సరిపడే డ్రెస్​లు కూడా వేసుకుంటాను. రెండు కల్చర్స్​నూ గౌరవిస్తాను. మా పేరెంట్స్ కూడా నన్ను నాకు నచ్చినట్లే ఉండమంటారు. ఇతర కల్చర్స్​ని గౌరవిస్తూనే మనకు నచ్చినట్లు మనం ఉండాలి అనే విషయంలో మహిళలకు ఉదాహరణగా ఉండాలి అని చెప్తుంటారు.