నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకుడు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో నందు, శ్యామ్ సుందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటించగా, ప్రియాంక రెబెకా, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది. శనివారం టీజర్‌ను రిలీజ్ చేశారు.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. పైసా, పోరి, సిగ్గు, శరం, అన్నీ పోగొట్టుకున్న మీలాంటి ఒక యువకుడి కథ అంటూ 'సైక్ సిద్ధార్థ' సినిమాలో శ్రీ నందు పాత్రను పరిచయం చేశారు. ఇప్పటివరకూ ఎక్కువ క్లాస్ రోల్స్లో కనిపించిన నందు.. ఈసారి కాస్త ట్రాక్ మార్చాడు. యూత్ని టార్గెట్ చేసుకొని బోల్డ్ కంటెంట్తో మెప్పించడానికి వస్తున్నట్లు టీజర్ తోనే క్లారిటీ ఇచ్చారు.
ఇందులో హీరో హైపర్ యాక్టివ్‌గా కనిపిస్తూ ప్రతి చిన్న విషయానికి ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటాడు. విజయం సాధించడంలో నమ్మకం కోల్పోయి ఓడిపోయిన వ్యక్తిగా తనను తాను చెప్పుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓవరాల్గా యూత్ని టార్గెట్ చేసుకొని బోల్డ్ కంటెంట్తో గాయని గీతా మాధురి భర్త, నటుడు నందు వస్తున్నట్లు టీజర్ తోనే క్లారిటీ ఇచ్చారు
The internet is going psych!#PsychSiddhartha is trending on X have you joined the madness yet? 👀
— Spirit Media (@SpiritMediaIN) November 8, 2025
#shreenandu#yamini #priyanka #varunreddy #shyamsunderreddy #kprakashreddy #smaran #nutiprateek #makrohith@SouthBayLive @asiansureshent#PsychSiddharthaFromDec12th#ShreeNandu… pic.twitter.com/hI2ulJO43W
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నందు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఫన్‌ని ఆడియెన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఫిలిం మేకింగ్ గ్రామర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ మూవీ తనకు చాలా స్పెషల్ అని యామిని భాస్కర్ చెప్పింది. ఈ సినిమాతో నందులోని ఒక కొత్త యాంగిల్ చూస్తారని డైరెక్టర్ వరుణ్ రెడ్డి అన్నాడు.
