OTT Review: ఈ వీకెండ్ రసవత్తరమైన రాజకీయ ఫైట్.. ఓటీటీలో పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్

OTT Review: ఈ వీకెండ్ రసవత్తరమైన రాజకీయ ఫైట్..  ఓటీటీలో పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్

ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇందులో ఫ్యామిలీ, హారర్, కామెడీ, యాక్షన్, పొలిటికల్ వంటి జోనర్స్లో సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చి అలరిస్తున్నాయి. అయితే, ఇక్కడ ఇంకొక్క విషయం గుర్తుచేయాలి. సాధారణంగా ఓటీటీ ఆడియన్స్కి వెబ్ సిరీస్ లంటే ఇష్టం. అందులో సక్సెస్ ఫుల్ సిరీస్లు అంటే మరీ ఇష్టం. అలా చాలా రోజుల నుంచి వెయిట్ చూస్తున్న వెబ్ సిరీస్ లకు కంటిన్యూగా వరుస సీజన్స్ వస్తుంటే, ఆ కిక్కు వేరేలా ఉంటుంది. అలా లేటెస్ట్గా వచ్చిన 'ఓటీటీ వెబ్ సిరీస్' ఏంటనేది ఓ లుక్కేద్దాం. 

మహారాణి సీజన్‌‌‌‌‌‌‌‌– 4:

ఇండియాలో టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌లో ఒకటైన ‘మహారాణి‌’ (Maharani) వెబ్ సీరీస్.. ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో మహారాణి వెబ్ సిరీస్ ముందు వరసలో ఉంటుంది. బీహార్ రాజకీయాల చుట్టూ ఆసక్తిగా తిరిగే ఈ సిరీస్.. ఫస్ట్ మూడు సీజన్లు సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇపుడు మహారాణి వెబ్ సీరీస్ నాలుగో సీజన్ (Maharani 4) ఓటీటీకి వచ్చేసింది. 

బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమా ఖురేషి ప్రధానపాత్రలో నటించిన ఈ సిరీస్‌ సీజన్ 4 నవంబరు 7 నుంచి సోనీ లివ్ (Sony LIV)లో స్ట్రీమింగ్‌ అవుతుంది. బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్, ప్రతి సీజన్కు ఉత్కంఠ రేపుతూ వెళ్తుంది. తొలి మూడు సీజన్స్లలో హుమా ఖురేషీ 'రాణీ భారతి' పాత్రలో అదరగొట్టింది. ఇపుడు నాలుగో సీజన్‌లో కూడా ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దారు. ఈ నాలుగో సీజన్ ‘బీహార్ వర్సెస్ ఢిల్లీ’ అనేలా రసవత్తరమైన ఫైట్ తీసుకొచ్చారు. 

కథేంటంటే?:

బిహార్‌‌‌‌‌‌‌‌ ముఖ్యమంత్రి భీమా భారతి (సోహం షా)ని హత్య చేసిన నిందితులను జైలుకు పంపిన తర్వాత అతని భార్య రాణి భారతి (హ్యూమా ఖురేషి) సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. జైలులో ఉన్నా ప్రత్యర్థులు ఆమెపై కుట్రలు చేస్తూనే ఉంటారు. మరోవైపు ప్రధాన మంత్రి సుధాకర్ శ్రీనివాస జోషి (విపిన్ శర్మ)తో తలపడాల్సి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతుని ఉపసంహరించుకోవడంతో ప్రాంతీయ పార్టీల సపోర్ట్‌‌‌‌‌‌‌‌ కోరుతాడు జోషి. కానీ, రాణి భారతి అందుకు ఒప్పుకోదు. ఆమె ధిక్కారం అతని అహంపై కొట్టిన చెంపదెబ్బలా అనిపిస్తుంది.

►ALSO READ | బాధపెట్టి ఉంటే క్షమించు.. చిరంజీవికి క్షమాపణ చెప్పిన RGV.. ఇంతకీ ఏమైందంటే..

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తుంది. ఆ రాజీనామే ఆమె కుటుంబం, పార్టీని చీల్చే వారసత్వ పోరాటానికి దారితీస్తుంది. కొడుకు జై ప్రకాష్ భారతి (శార్దూల్ భరద్వాజ్) ఎలాగైనా సీఎం సీటు దక్కించుకోవాలి అనుకుంటాడు. కానీ.. రాణి తన కూతురు రోష్ణి (శ్వేతా బసు ప్రసాద్)ని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.