గండిపేట, వెలుగు: సోషల్ మీడియాలో రీల్స్, లైక్స్ కోసం రోడ్లపై డేంజరస్స్టంట్స్చేస్తున్న ముగ్గురు యువకులను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 6న రాత్రి అత్తాపూర్పిల్లర్ నంబర్ 257, ఫ్లిప్‌కార్ట్ గోడౌన్ సమీపంలో ముగ్గురు యువకులు నంబర్ ప్లేట్లు లేని మూడు బైక్‌లతో స్టంట్స్చేశారు.
ముందు పయ్య పైకి లేపి ఓవర్‌స్పీడ్‌తో నడుపుతూ పక్కనున్న వాహనదారులను టెన్షన్పెట్టారు. దీన్నంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు. వైరల్ కావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు..మహ్మద్మోహినుద్దీన్ (24), మహమ్మద్ రిజ్వాన్ (21), తౌహిద్ (19)లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
