ఒకటికి మించి పాన్ కార్డులు ఉంటే ఏమవుతుంది?

ఒకటికి మించి పాన్ కార్డులు ఉంటే ఏమవుతుంది?

మన దేశంలో ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డు కూడా చాలా ముఖ్యం. అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఈ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఖాతా తెరవడానికి, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడానికి పాన్ నంబర్ చాలా అవసరం. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తి పేరుపై ఒకటికి మించి పాన్ కార్డులు ఉంటే జరిమానా కట్టాల్సి ఉంటుంది. చట్టప్రకారం ఇది నేరం. ఒకటి కంటే ఎక్కువగా పాన్ కార్డులు కలిగిన వ్యక్తులపై రూ.10 వేల వరకు పెనాల్టీ పడుతుంది. అందుకే మీ పేరు మీద ఒకటికి మించి పాన్ కార్డులు లేకుండా చూసుకోండి. ఒకవేళఒకటికి మించి పాన్ కార్డులు ఉంటే ఆన్‌లైన్‌‌లో పాన్ ఛేంజ్ రిక్వెస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. దరఖాస్తు ఫామ్‌లో ప్రస్తుతం వాడుతున్న పాన్ కార్డ్ నంబర్‌ను టాప్‌లో ఉంచాలి. మిగిలిన పాన్ కార్డులను 11వ నంబర్‌ ఐటమ్‌లో నమోదు చేయాలి. ఆ పాన్ కార్డులకు సంబంధించిన క్యాన్సలేషన్‌‌ను సబ్మిట్ చేయాలి. దీంతో మీ పేరు మీద ఉన్న అదనపు పాన్ కార్డులు రద్దవుతాయి.  

మరిన్ని వార్తల కోసం: 

సొంతవాళ్లను కాదని.. రిక్షావాడికి రూ.కోటి ఆస్తి

13 ఏళ్లకే పెళ్లి.. ఆరు నెలల్లో 400 మంది రేప్

పులులతో ఫైట్‌ చేసే ఈ పెద్దాయన గురించి తెలుసా?