పేరెంట్స్ మందలించారని.. నలుగురు బాలికల సూసైడ్

పేరెంట్స్ మందలించారని.. నలుగురు బాలికల సూసైడ్
  • బిహార్​లోని ఔరంగాబాద్​లో ఘటన 

ఔరంగాబాద్: అబ్బాయిలతో మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో నలుగురు బాలికలు సూసైడ్ చేసుకున్నారు. బిహార్​లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. హస్పూర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దళిత బస్తీకి చెందిన 10 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలికలు జనవరి 29న విషపదార్థాలు తీసుకున్నారు. వీరిలో నలుగురు స్పాట్​లోనే మృతి చెందారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. 

ఈ విషయంపై వారి తల్లిదండ్రులకు సమాచారం లేకపోవడంతో మృతదేహాలకు అదేరోజున పోస్ట్ మార్టం చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ప్రాణాలతో బయటపడ్డ బాలిక నుంచి స్టేట్​మెంట్ తీసుకున్నారు. తల్లిదండ్రులు మందలించడంతో తాము ఐదుగురం విష పదార్థాలు తీసుకున్నామని ఆ బాలిక తెలిపింది. ఒకేసారి అందరం విషపదార్థాలు తీసుకోగా నలుగురు మరణించారని చెప్పింది.