ఆసీస్ చేతిలో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌.. వట్టి చేతులతో స్వదేశానికి పాక్ ఆటగాళ్లు

ఆసీస్ చేతిలో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌.. వట్టి చేతులతో స్వదేశానికి పాక్ ఆటగాళ్లు
  •     పాక్‌‌‌‌పై 3-0తో సిరీస్‌‌‌‌ నెగ్గిన కంగారూలు

సిడ్నీ: పాకిస్తాన్‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌ల టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను ఆస్ట్రేలియా 3–0తో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసింది. కెరీర్‌‌‌‌లో చివరి టెస్ట్‌‌‌‌ ఆడిన డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (57), లబుషేన్‌‌‌‌ (62 నాటౌట్‌‌‌‌) హాఫ్‌‌‌‌ సెంచరీలతో రాణించడంతో.. నాలుగు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్ట్‌‌‌‌లోనూ కంగారూలు 8 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌ను చిత్తు చేశారు. 130 రన్స్‌‌‌‌ను ఛేదించేందుకు శనివారం బరిలోకి దిగిన ఆసీస్‌‌‌‌ 25.5 ఓవర్లలో 130/2 స్కోరు చేసి గెలిచింది. ఉస్మాన్‌‌‌‌ ఖవాజ (0) డకౌటైనా, వార్నర్‌‌‌‌, లబుషేన్‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌కు 119 రన్స్‌‌‌‌ జోడించి విజయాన్ని అందించారు. 

సాజిద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 68/7 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన పాక్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 115 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. రిజ్వాన్‌‌‌‌ (28), అమెర్‌‌‌‌ జమల్‌‌‌‌ (18) పోరాడి విఫలమయ్యారు. హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ 4, నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ 3 వికెట్లు తీశారు. ఆమెర్‌‌‌‌ జమల్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, కమిన్స్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి. తాజా విజయంతో వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ)లో ఆసీస్‌‌‌‌ (56.2 పీసీటీ) టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు చేరుకోగా, ఇండియా (54.16 పీసీటీ) రెండో స్థానానికి పడింది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌, వెస్టిండీస్‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌, శ్రీలంక తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.