ఆకాశంలో అద్భుతం.. కనుల విందు చేసిన.. రంగురంగుల అరోరాస్

ఆకాశంలో అద్భుతం.. కనుల విందు చేసిన.. రంగురంగుల అరోరాస్

ఆకాశం.. బుధవారం రాత్రి అద్భుత దృశ్యానికి వేదికైంది. రంగురంగుల అరోరాస్​ కనువిందు చేశాయి. ఉత్తర ధృవప్రాంతాలు, దక్షిణ భూభాగం రెండింటిలోనూ ఆరోరా లైట్స్​ అద్భుతంగా కనిపించాయి. ఈ అరోరా లైట్లు గతం కంటే ఫుల్​రంగుల కాంతితో ప్రకాశవంతమైన వెలుగులు పంచాయి.  నిన్న రాత్రి రెండు ధృవాల మధ్య ఏర్పడిన ఈ అద్బుతానికి సంబంధించిన వీడియోలు  ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. 

నార్వే, ఐస్లాండ్, ఫిన్లాండ్, కెనడా, ఆస్ట్రేలియాలోని విక్టోరియా, టాస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో బుధవారం రాత్రి ప్రకాశవంతమైన ఔరోరా వెలుగులు విరబూశాయి. ఆస్ట్రేలియా ప్రజలు ఈ అద్భుతాన్ని వీడియోలుగా, ఫోటోలుగా నెట్టింట షేర్ చేసి వెలుగుల జిలుగులు పంచుకున్నారు. ఇంతకీ అరోరాస్​ అంటే ఏమిటీ?.. ఏ ప్రాంతాల్లోకనిపిస్తాయి..? ఎందుకు ఆరోరాస్​ ఏర్పడతాయి..? అరోరాస్​ ఏర్పడితే జరిగే ఏం జరుగుతుంది..?

ఆరోరాస్​ అంటే.. 

అరోరా అనేది భూమి ఆకాశంలో విరజిమ్ముతూ కనిపించే సహజ కాంతి. ఇది ఆర్కిటిక్ ,అంటార్కిటిక్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోరా బోరియాలిస్​, అరోరా అస్ట్రాలిస్​ అని పిలువబడే ఈ అరోరాస్​.. సూర్యుడి నుంచి వచ్చే శక్తివంతమైన చార్జ్డ్ కణాలు భూమి వాతావరణంలోని వాయువులతో జరిపే సంకర్షణ వల్ల ఏర్పడతాయి. ఈ పరస్పర చర్య వాయు అణువులను ఉత్తేజపర్చి తద్వారా శక్తివంతమైన వివిధ రంగులతో కూడిన వెలుగులను విరబూయిస్తాయి. 

నిన్న రాత్రి ఉత్తర ధృవ ప్రాంతాలైన నార్వే, ఐస్లాండ్, ఫిన్లాండ్, కెనడాలతో పాటు దక్షిణ భూభాగం ప్రాంతాలైన ఆస్ట్రేలియాలోని విక్టోరియా, టాస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా దేశాల్లో ఆకాశం ఎరుపు, ఆకుపచ్చ ఊదా రంగులతో జిగేల్​ మంటూ మెరిసిపోయింది.. అక్కడి ప్రజలకు కనువిందు చేసింది. ఆ దేశాల ప్రజలు ఈ అద్భుత దృశ్యాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో ఆశ్చర్యాన్ని  వ్యక్తం చేస్తున్నారు. అరోరాస్​ అద్భుతాలను వీడియోలుగా, ఫోటోలుగా రికార్డు చేసి షేర్​ చేశారు. 

ఆరోరాస్​ ఎలా ఏర్పడతాయి?

శాస్త్రవేత్తల ప్రకారం..సూర్యుని నుంచి వచ్చిన బలమైన చార్జ్డ్​కణాలు కారోనల్ మాస్  భూమి అయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపడంతో అరోరాస్​వెలుగులు విరజిమ్ముతాయి. ఈ సౌర కణాలు వాతావరణంలోని అయాన్‌లతో సంఘర్షణకు గురవడంతో పెద్ద ఎత్తు రంగురంగుల కాంతులు ఆకాశంలో కనిపిస్తాయి. ఇదే నిన్న అస్ట్రేలియా ప్రాంతాల్లో సంభవించింది. ఉత్తర ధృవ ప్రాంతం అటు దక్షిణ భూభాగంలో ఒకేసారి ఈ రంగుల కాంతులు వెదజల్లడం అద్భుతంగా అనిపించింది. దీనిని గ్లోబల్ ఔరోరల్ యాక్టివిటీ  పీక్గా శాస్త్రవేత్తలు గుర్తించారు.

నిన్న రాత్రి రెండు ధృవాల మధ్య జరిగిన ఈ సహజ కళా ప్రదర్శన..ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్​ లో ఉంది. ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా కనిపించే అవకాశం ఉన్నప్పటికీ నిన్నటి ఏర్పడిన  ప్రకృతి పండుగే ప్రపంచానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.