Austrslia vs Afganistan: వన్డే సిరీస్ బహిష్కరించిన ఆసీస్

Austrslia vs Afganistan: వన్డే సిరీస్ బహిష్కరించిన ఆసీస్

ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జ‌ర‌గాల్సిన వ‌న్డే సిరీస్ నుంచి ఆస్ట్రేలియా జట్టు త‌ప్పుకుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు సీఏ ప్రకటించింది. మహిళా స్వేచ్ఛ, అమ్మాయిల విద్య, ఉద్యోగాలపై తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సిరీస్ ను  బహిష్కరిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. 

అఫ్ఘాన్ తో పాటు అన్ని దేశాల్లో మహిళల క్రీడలకు ప్రోత్సహిస్తామని సీఏ పేర్కొంది. అయితే, ఈ సిరీస్ నుంచి ఆస్ట్రేలియా తప్పుకోవడం వల్ల ఐసీసీ వ‌న్డే సూప‌ర్ లీగ్ పాయింట్స్ కోల్పోతుంది. ఆఫ్ఘాన్ ఖాతాలోకి 30 పాయింట్లు చేరుతాయి. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం పూర్తిగా స్వీకరించింది. తమ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.