ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. జిల్లాలోని ఇంద్రవెల్లికి చెందిన అనిల్ 15 రోజుల కింద ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో అరెస్టయ్యాడు. అతడిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. నిందితుడు ఎక్కువగా మద్యం సేవించేవాడు కావడంతో రిమ్స్‌లోని ఖైదీల వార్డులో అడ్మిట్ చేశారు. మంగళవారం అతను కనిపించపోవడంతో జైలు సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
