రూ.100 కోట్లతోప్రతి ఇంటికి తాగునీరు..రామగుండంలో నల్లా కనెక్షన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

 రూ.100 కోట్లతోప్రతి ఇంటికి తాగునీరు..రామగుండంలో నల్లా కనెక్షన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​పరిధిలో రూ.100 కోట్లతో ప్రతి ఇంటికీ తాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ అన్నారు. కార్పొరేషన్ ​పరిధిలోని 38వ డివిజన్​లో తాగునీటి సరఫరా నల్లా కనెక్షన్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. 

ప్రతి ఇంటికి తాగునీటిని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మేయర్​ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు రాము, గట్టయ్య, ముస్తఫా పాల్గొన్నారు.