భారత్ నుండి వచ్చే ప్రయాణీకులకు ఆస్ట్రేలియా గుడ్ న్యూస్ చెప్పింది. కోవాగ్జిన్ తీసుకున్న ప్రయాణీకులకు దేశంలోకి అనుమతినిచ్చేందుకు ఆమోదం తెలిపింది. నిబంధనల సడలింపుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభించడంతో..కఠినమైన సరిహద్దు విధానాలను అవలంభించిన ఆస్ట్రేలియా 18 నెలల తర్వాత ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో లక్షలాది మంది ప్రయాణీకులు అనుమతి లేకుండా ప్రయాణించవచ్చు. దేశంలోకి వచ్చే సమయంలో కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, చైనాలోని షినోఫార్మ్ అభివృద్ధి చేసిన బిబిఐబిపి-కోర్‌విని వ్యాక్సిన్లను ఆమోదిస్తున్నామని తెలిపింది ఆస్ట్రేలియా. కోవాగ్జిన్ తీసుకున్న 12 అంతకన్నా ఎక్కువ ఏళ్ల వయస్సున్న వారు, కోర్‌వి వ్యాక్సిన్ తీసుకున్న 18 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు వారికి దేశంలోకి అనుమతినిస్తున్నామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.
