హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా అంబాసిడర్టీమ్ బుధవారం గాంధీభవన్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ ఫారెల్, ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సారా కిర్లూ, పొలిటికల్ సెక్రటరీ ఆక్ టేలర్కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని, అందులో ఉన్న శిలాఫలకాలను పరిశీలించారు. దాని నిర్మాణ శైలి గురించి తెలుసుకున్నారు. గాంధీభవన్ ను అణువణువునూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి చూపించారు. దాని విశేషాలను వివరించారు. అనంతరం ఉత్తమ్‌తో వారు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

