
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని మంగళవారం ఆస్ట్రియన్ పార్లమెంటరీ బృందం సందర్శించింది. ఈ విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆస్ట్రియన్ బృందంలో నేషనల్ కౌన్సిల్ లోయర్ హౌజ్ ప్రెసిడెంట్ వొగ్గాంక్ సొగటెకో, ఫెడెరల్ కౌన్సిల్ అప్పర్ హౌజ్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ సొవిత్ ఫౌచ్, ఆస్ట్రియన్ పార్లమెంట్ సభ్యులు, అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా చివరి రోజు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఆస్ట్రియన్ బృందం తిలకించింది. మొత్తం 18మంది సభ్యులు గల ఈ ఆస్ట్రియన్ పార్లమెంటరీ బృందం సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను తిలకించింది.