ఆర్థికవేత్త పాఠాలు! 

ఆర్థికవేత్త పాఠాలు! 

‘డబ్బు, ఆదాయం, ఖర్చు, పొదుపు,..’ మనిషి నిత్య జీవితంతో ముడిపడిన పదాలు. గ్లోబలైజేషన్​ తర్వాత ప్రపంచంలో ఎక్కడ  ఏం జరిగినా అది మనిషిపై, మనీపై పడడం సాధారణమైంది. ఫలితంగా ద్రవ్యోల్బణం, స్టాక్​ ఎక్స్ఛేంజ్​​, సెన్సెక్స్, ఆర్థిక మాంద్యం.. వంటివి పేదలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. కానీ, వీటిని అర్థం చేసుకోవడం, భవిష్యత్​ను భద్రంగా నిర్మించుకోవడం అంత సులభం కాదు. ఈ క్రమంలో ‘దేశ ఆర్థికాభివృద్ధికి మన ముందు తరం ఏం చేసింది? రాబోయే కాలంలో మనమేం చేయాలి?’ అనే విషయాలను ‘ది ఇండియా స్టోరీ’ పుస్తకం ద్వారా చెప్పాడు రచయిత బిమల్​ జలాన్​.  కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా(1981‌‌‌‌–88), రిజర్వ్​ బ్యాంకు గవర్నర్​(1997‌‌–2003)గా పనిచేసి రిటైరైన ఆయనకు ఆర్థిక విషయాల్లో మంచి పట్టు ఉంది. ‘ఇండియన్​ ఎకానమీ’, ‘ప్రయారిటీస్​ ఫర్ ది ఫ్యూచర్’, ‘ఎమర్జింగ్​ ఇండియా’ పుస్తకాలు కూడా రాశాడు. ఈ మధ్య రాసిన ‘ది ఇండియా స్టోరీ’ పుస్తకంలో భారత ఆర్థిక చరిత్ర, భవిష్యత్​లో ఆర్థిక భరోసాకు రాజకీయంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పాడు. ప్రధానంగా భారత ఆర్థిక రంగంలో 1991 నుంచి 2019 వరకు జరిగిన మార్పులు, పథకాలు, పాలసీలు, రాజకీయ ప్రభావాలు ప్రస్తావించాడు. ‘లెర్నింగ్​ ఫ్రమ్​ అవర్​ ఎకనమిక్​ పాస్ట్​, ‘బియాండ్​ ది మెట్రిక్స్​ ఆఫ్​ ఎకానమీ’ అనే రెండు భాగాలుగా పుస్తకాన్ని విభజించాడు. అయితే, పుస్తకంలో వాడిన చాలా పదాలు(టెర్మినాలజీ) సామాన్యులకు అంత సులభంగా అర్థం కావు. ఎకనామిక్స్​ స్టూడెంట్స్​, ఎకనామిస్ట్స్, బ్యాంకింగ్​ సెక్టార్​ అధికారులకు ఈ పుస్తకం చాలా ఉపయోగం.


పుస్తకం– ది ఇండియా స్టోరీ; యాన్​ ఎపిక్​ జర్నీ ఆఫ్​ డెమొక్రసీ అండ్​ డెవలప్​మెంట్
రచయిత–  బిమల్​ జలాన్​​
ప్రతులకు– రూప పబ్లికేషన్స్​, అమెజాన్, ఫ్లిప్​కార్ట్​, పేజీలు– 296, ధర– రూ.402/–