రోడ్డు యాక్సిడెంట్ లో వృద్ధుడు మృతి..ఉప్పల్‌‌రామంతాపూర్ రహదారిపై ఘటన

రోడ్డు యాక్సిడెంట్ లో వృద్ధుడు మృతి..ఉప్పల్‌‌రామంతాపూర్ రహదారిపై ఘటన

ఉప్పల్, వెలుగు: రోడ్డు యాక్సిడెంట్​లో ఓ వృద్ధుడు మృతిచెందాడు. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన వేల్పుల నర్సింహ(65) గురువారం మనవరాలు తేజావతిని రామంతాపూర్​‌‌‌‌‌‌– ఉప్పల్​ ప్రధాన రహదారిలోని ఎన్​ఎస్​ఎల్ సాప్ట్​వేర్​ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్​ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఉప్పల్​ నుంచి రామంతాపూర్​కు వెళ్తున్న గుర్తుతెలియని ఆటో ఢీకొట్టింది. దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.


డీసీఎం ఢీకొని యువకుడు..


జీడిమెట్ల: డీసీఎం ఢీకొని యువకుడు మృతిచెందాడు. దుండిగల్​ డబుల్​ బెడ్​రూం ఇండ్లలో నివాసముండే మహ్మద్​ జహంగీర్​ కొడుకు ముదాసీర్(22) ఇంటర్​ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం తన ఫ్రెండ్​ స్కూటీ తీసుకుని వెళ్లాడు. గాగిల్లాపూర్​ నుంచి గండిమైసమ్మకు వస్తుండగా గండిమైసమ్మ పెట్రోల్​ పంపు వద్ద స్కూటీనీ వెనక నుంచి ఓ టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముదాసీర్​ స్పాట్​లోచనిపోయాడు.