V6 News

ఆటో ట్రాలీ.. బైక్ ఢీ.. స్పాట్‎లో ఒకరు మృతి

ఆటో ట్రాలీ.. బైక్ ఢీ.. స్పాట్‎లో ఒకరు మృతి

వెంకటాపురం వెలుగు: ట్రాలీ ఆటో.. బైక్ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఎస్ఐ సతీశ్ తెలిపిన ప్రకారం.. వాజేడు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పోయిలబోయిన సమ్మయ్య(80) సోమవారం ఉదయం చనిపోయాడు. తాత అంత్యక్రియలకు వెళ్లిన గొంది సాంబశివరావు(40),  బైక్ పై సాయంత్రం 4 గంటలకు తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. 

జాతీయ రహదారి దాటుతుండగా ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో సాంబశివరావుకు తలకు తీవ్ర గాయాలై స్పాట్‎లో చనిపోయాడు. మృతుడి భార్య వెంకటరమణ, కొడుకు ఉన్నారు. సాంశివరావు మృతితో గ్రామాల్లో విషాదం నెలకొంది.  డెడ్ బాడీని  పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.