ఆటో మొబైల్ పార్ట్స్ తయారీ కంపెనీలకు ఐదేళ్లు రాయితీలు

ఆటో మొబైల్ పార్ట్స్ తయారీ కంపెనీలకు ఐదేళ్లు రాయితీలు
  • కంపెనీలకు ఐదేళ్లపాటు రాయితీలు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఇండస్ట్రీని డెవలప్​ చేయడంలో భాగంగా ఆటో విడిభాగాల తయారీని పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్​కు మొత్తం 75 కంపెనీలు అర్హత సంపాదించాయి. వీటిలో మారుతీ సుజుకి, హీరో మోటోకార్ప్, బాష్, లుకాస్–- టీవీఎస్, మిత్సుబిషి ఎలక్ట్రిక్, మదర్సన్ సుమీ, టాటా ఆటోకాంప్,  టయోటా కిర్లోస్కర్ ఆటోమొబైల్ వంటి కంపెనీలు ఉన్నాయి.  ఫలితంగా ఐదేళ్ల కాలంలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా,  రూ. 74,850 కోట్ల విలువైన ఇన్వెస్ట్​మెంట్లకు ప్రపోజల్స్​ వచ్చాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి  తెలిపారు. "ప్రతిపాదిత రూ. 45,016 కోట్ల పెట్టుబడి ఛాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఆమోదం పొందిన దరఖాస్తుదారుల నుండి వచ్చింది.  కాంపోనెంట్ ఛాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అప్రూవల్స్​ పొందిన దరఖాస్తుదారుల నుండి రూ. 29,834 కోట్లు వస్తాయి" అని అధికారి తెలిపారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, సియట్​లు.. ఈ స్కీమ్ కింద ఆమోదం పొందిన రెండు కొత్త నాన్-ఆటోమోటివ్ ఇన్వెస్టర్ (కాంపోనెంట్) కంపెనీలు.

మొత్తం 115 అప్లికేషన్లు..

గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో ప్రభుత్వం నోటిఫై చేసిన ఆటోమోటివ్  ఆటో కాంపోనెంట్ రంగానికి సంబంధించి రూ.25,938 కోట్ల విలువైన పిఎల్‌‌‌‌ఐ  స్కీమ్ కోసం 115 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 13 ఒరిజనల్ ఎక్విప్మెంట్ మేకర్లు,  83 కాంపోనెంట్ కంపెనీలు, 9 కొత్త నాన్–-ఆటోమోటివ్ ఇన్వెస్టర్​ కంపెనీలు,  3 కొత్త నాన్-ఆటోమోటివ్  ఇన్వెస్టర్ కంపెనీలు ఉన్నాయి. ఆటో  పీఎల్ఐ స్కీమ్ వల్ల కంపెనీలు అడ్వాన్స్‌‌‌‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తులు మనదేశంలోనే చవకగా తయారవుతాయి. గ్లోబల్ ఆటోమోటివ్ ట్రేడ్​లో భారతదేశ వాటా  పెరుగుతుంది. ఈ పీఎల్ఐ స్కీమ్ ప్రస్తుత ఆటోమోటివ్ కంపెనీలతోపాటు కొత్త నాన్-–ఆటోమోటివ్ ఇన్వెస్టర్ కంపెనీలకు) అందుబాటులో ఉంది. ఇది 2022 –- 2023 ఆర్థిక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాలపాటు అమలవుతుంది. ఆమోదం పొందిన కంపెనీ వరుసగా ఐదేళ్లపాటు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతుంది. అమ్మకాలను లెక్కించడానికి 2019–-2020 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్‌‌‌‌గా తీసుకుంటారు.