అనవసర ప్రయాణాలు మానుకోండి ...వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి

అనవసర ప్రయాణాలు మానుకోండి ...వికారాబాద్  ఎస్పీ నారాయణరెడ్డి

వికారాబాద్, వెలుగు: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమతంగా ఉండాలని వికారాబాద్​ఎస్పీ కె.నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మోమిన్​పేట మండలంలోని నందివాగు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు. నీటిమట్టం గణనీయంగా పెరగడంతో చెరువు కట్టను పరిశీలించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. చెరువు పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దన్నారు. మత్స్యకారులు, రైతులు రాత్రివేళల్లో చెరువు వద్ద పనులు చేయవద్దన్నారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మోమిన్‌‌పేట్ సీఐ వెంకట్ తదితరులు ఉన్నారు.