దివ్యాంగుల హక్కు చట్టంపై అవగాహన తప్పనిసరి : ప్రొఫెసర్ వాల్యా

దివ్యాంగుల హక్కు చట్టంపై అవగాహన తప్పనిసరి :  ప్రొఫెసర్ వాల్యా

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​కు వచ్చే దివ్యాంగుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని వారికి సాయమందించాలని ఆర్థొపెడిక్​డిపార్ట్​మెంట్‌ హెచ్​వోడీ, ప్రొఫెసర్​ బి. వాల్యా అన్నారు.  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీ హాస్పిటల్​లోని ఆర్థొపెడిక్  విభాగం సెమినార్‌‌ హాల్‌లో  పీజీ డాక్టర్లకు అవేర్‌‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. 

శారీరక, మానసిక వైకల్యం ఉన్న వారి కోసం ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు 2016లో ప్రత్యేక చట్టం రూపొందిందన్నారు.  దివ్యాంగుల హక్కుల చట్టం –-2016లో  పేర్కొన్న  పలు అంశాలను ఆయన పీజీ డాక్టర్లకు పవర్​ పాయింట్​ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. కార్యక్రమంలో  ఆర్థొపెడిక్‌ విభాగం ప్రొఫెసర్లు డాక్టర్​ సత్యనారాయణ, డాక్టర్​రవీందర్, పీజీ  డాక్టర్లు పాల్గొన్నారు.