తేనెటీగల పెంపకంపై  అవగాహన .. ఫిబ్రవరి 15,16 తేదీల్లో నిమ్స్ మేలో జాతీయ సదస్సు

తేనెటీగల పెంపకంపై  అవగాహన ..  ఫిబ్రవరి 15,16 తేదీల్లో నిమ్స్ మేలో జాతీయ సదస్సు

ఖైరతాబాద్, వెలుగు: తేనెటీగల పెంపకంపై ఈ నెల 15,16 తేదీల్లో యూసుఫ్​గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్(నిమ్స్ మే)లో రెండ్రోజుల పాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ఫ్యాకల్టీ శ్రీకాంత్ శర్మ, రాజేంద్రప్రసాద్ తెలిపారు.

గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. నేషనల్ బీ బోర్డు అధికారులు, సైంటిస్టులు తేనెటీగల పెంపకంపై అవగాహన కలిగిస్తారన్నారు. ఈ సదస్సులో అగ్రికల్చర్, హార్టికల్చర్, అటవీ శాఖ అధికారులు, అగ్రికల్చర్ స్టూడెంట్లు, రైతులు పాల్గొంటారన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 040–-23633228 నంబర్లను సంప్రదించాలన్నారు.