ఆయుష్‌‌‌‌‌‌‌‌ యూజీ దరఖాస్తులు షురూ..

ఆయుష్‌‌‌‌‌‌‌‌ యూజీ దరఖాస్తులు షురూ..
  • కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్లను రీ-ఓపెన్ చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
  • రేపు మధ్యాహ్నం 2 గంటల వరకే చాన్స్​
  • నిజామియా, గురునానక్ కాలేజీలకూ పర్మిషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026-–27 విద్యా సంవత్సరానికి గానూ ఆయుష్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌(యూజీ) కోర్సుల్లో కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కోటా ప్రవేశాల కోసం ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులతోపాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని ప్రభుత్వ నిజామియా టిబ్బి కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన విజ్ఞప్తి మేరకు కాళోజీ హెల్త్ వర్సిటీ కన్వీనర్​కోటా రిజిస్ట్రేషన్ల విండోను రీ-ఓపెన్ చేసింది.

నీట్ యూజీ-–2026 అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ (https://tsbahnu.tsche.in) ద్వారా బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా ఆన్‌‌‌‌‌‌‌‌ లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్‌‌‌‌‌‌‌‌ లోడ్ చేయాలని స్పష్టం చేసింది.

కాగా, ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి హైదరాబాద్ చార్మినార్‌‌‌‌‌‌‌‌ లోని గవర్నమెంట్ నిజామియా టిబ్బి కాలేజీలో బీయూఎంఎస్ కోర్సుకు ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌తో కలిపి 94 సీట్లు, రంగారెడ్డి జిల్లాలోని గురునానక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో బీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 50 సీట్లకు కేంద్ర కమిషన్ల నుంచి కొత్తగా అనుమతి లభించింది.