రెండేళ్ల జైలు శిక్ష తర్వాత.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ బెయిల్‌పై రిలీజ్

 రెండేళ్ల జైలు శిక్ష తర్వాత.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ బెయిల్‌పై రిలీజ్

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ రెండేళ్ల శిక్ష అనంతరం జైలునుంచి విడుదలయ్యారు. మంగళవారం దాదాపు 23 నెలల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జైలు నుంచి బయటకు వచ్చారు ఆజంఖాన్. ఆజం ఖాన్ విడుదల సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యకర్తలు రావడంతో జైలు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. సీతాపూర్ నగరంలో 144 సెక్షన్​ విధించారు. 

అలహాబాద్ హైకోర్టు బెయిల్..

క్వాలిటీ బార్ భూ కబ్జా కేసులో సెప్టెంబర్ 18న అలహాబాద్ హైకోర్టు నుంచి ఆజం ఖాన్ బెయిల్ ఇచ్చింది. క్వాలిటీ బార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవేలోని సైద్ నగర్ హర్దోయ్ పట్టిలో ఉన్న క్వాలిటీ బార్​ భూమి కబ్జా చేశారని ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఈ కేసులో ఖాన్ హైకోర్టును ఆశ్రయించడంతో అలహాబాద్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. 

17 ఏళ్ల నాటి కేసులో నిర్దోషిగా..

2025 ప్రారంభంలో ఆజంఖాన్​మరో కేసులో నిర్దోషిగా ప్రకటించింది ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించారనే ఆరోపణలతో 17 ఏళ్ల నాటి కేసులో ఆజం ఖాన్‌ను ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.