మల్కాజిగిరి, వెలుగు: ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే పోలీసు వ్యవస్థను నిర్మిస్తానని మల్కాజిగిరి నూతన పోలీసు కమిషనర్ బి.సుమతి తెలిపారు. శుక్రవారం ఆమె కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉందన్నారు.
మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని, లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి కొత్త వ్యూహాలతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.యువత, మహిళల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
