తాత నువ్వు తోపే.. 56 కిలోల సిలిండర్లు గడ్డంతో లేపిండు.. వాట్​ ఈజ్​ యూవర్​ సీక్రెట్​ ఆఫ్​ ఎనర్జీ

తాత నువ్వు తోపే.. 56 కిలోల సిలిండర్లు గడ్డంతో లేపిండు.. వాట్​ ఈజ్​ యూవర్​ సీక్రెట్​ ఆఫ్​ ఎనర్జీ

అప్పట్లో మా తాత 100 కిలోల బస్తాలైనా సింగల్​ హ్యాండ్​తో పైకెత్తేటోడు.. మా తాత గొడ్డు కష్టం చేసేటోడు అని ఈ తరం మనుమళ్లు, మనుమరాళ్లు చెప్పుకుంటరు. వాళ్ల తిండి, వాళ్ల కష్టం అట్లుండేది. జబ్బు అంటే తెలియని రోజుల నుంచి జబ్బులను డబ్బులలాగా వెంటబెట్టుకునే రోజులకు మనం వచ్చాం. సరే ఇప్పుడిదంతా ఎందుకులే అనుకుంటున్నారా..  65 ఏళ్ల వయస్సు కలిగిన ఓ సాధువు చేసిన పని చూస్తే 'అబ్బా తాత నువ్​ కేక' అనక మానరు. 

రాజస్థాన్​ లోని భరత్​పుర్ కి చెందిన జానకీదాస్ మహరాజ్​ తన ఆరగడుగుల గడ్డం సాయంతో రెండు నిండు సిలిండర్లను అలవోకగా ఎత్తగలుగుతున్నాడు. మథుర బైపాస్​ రోడ్డు సమీపంలో నివసించే ఈయన విన్యాసం చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. గతంలో కుంభమేళా సాధువుల మధ్య జరిగిన పోటీలో కూడా ఆయన పాల్గొన్నాడు.  గడ్డంతో బరువులు ఎత్తడంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  మధ్యప్రదేశ్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కూడా విజయం సాధించారు. ఈ విజయంతో బైక్ గిఫ్ట్​గా వచ్చింది. 

అవే నన్నింత స్ట్రాంగ్​ చేశాయి..

56 కిలోల బరువున్న ఆ సిలిండర్లను ఎత్తడం మామూలు విషయం కాదు. అలాంటిది గడ్డంతో ఎత్తడం ఇంపాజిబుల్.  ఇక ఆయన ఆహార అలవాట్లు ఎంటో తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.  ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించగా.. యువత తనలాగా యోగా, ధ్యానం, వ్యాయామాలు చేస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించాడు. వాటితో పాటు మంచి తిండి, కంటి నిండా  నిద్ర ఇవన్నీ తన ఎనర్జీ సిక్రేట్స్ అని చెప్పారు.