జట్టు ప్రయోజనాలే ముఖ్యం: బాబర్ ఆజం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం: బాబర్ ఆజం

లాహోర్: భవిష్యత్​లో పాకిస్తాన్ జట్టు సారథ్య బాధ్యతలు మళ్లీ చేపట్టే అవకాశాన్ని తాను తోసిపుచ్చడం లేదని, ఎప్పుడూ జట్టు ప్రయోజనాలే తనను నడిపిస్తాయని బాబర్ ఆజం శనివారం తెలిపాడు. " కెప్టెన్సీ అంశం ప్రస్తుతం పక్కన పెడితే.. ఇప్పుడు నా దృష్టి మొత్తం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్‌‌‌‌‌‌‌‌పైనే ఉందని" బాబర్ పేర్కొన్నాడు.

పీఎస్ఎల్ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌లో బాబర్.. పెషావర్ జల్మీని ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేర్చడంతో పాటు రెండు సెంచరీలతో భారీగా పరుగులు సాధించాడు. 2020 నుంచి 2023 మధ్య అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఉన్న బాబర్.. వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్​గా తప్పుకున్నాడు.