పిల్ల కోతితో పులి పిల్ల ఫ్రెండ్షిప్

పిల్ల కోతితో పులి పిల్ల ఫ్రెండ్షిప్

స్నేహానికి వయసుతో గానీ, లింగంతో గానీ సంబంధం లేదని ఏ విధంగా చెప్తామో.. జాతులకు కూడా ఎలాంటి సంబంధముండదు. ఈ విషయాన్ని రెండు జంతువులు నిరూపిస్తున్నాయి. మామూలుగా కుక్క, పిల్లి లేదా కుక్క, కోతి లాంటి జంతువులు స్నేహంగా ఉండడం చూస్తూనే ఉంటాం. అలానే ఓ కోతి పిల్ల, పులి పిల్ల కలిసి ఆడుకుంటున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఈ రెండు జంతువుల మధ్య ఏర్పడిన స్నేహపూర్వక బంధాన్ని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. సో స్వీట్ అని ఒకరు, అందమైన పిల్లలు అని మరొకరు రిప్లై ఇస్తున్నారు. అయితే పిల్ల కోతి, పులి పిల్ల వీపుపై సవారీ చేస్తున్న ఈ వీడియో షేర్ చేయగానే వేలల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి.