మీ పిల్లలకు పేరు పెడుతున్నారా.. ఇలా ఆలోచించండి.. ఈ టిప్స్ పాటిస్తే చక్కని పేరు వస్తుంది..!

మీ పిల్లలకు పేరు పెడుతున్నారా.. ఇలా ఆలోచించండి.. ఈ టిప్స్ పాటిస్తే చక్కని పేరు వస్తుంది..!

కొత్తగా పెళ్లయితే చాలు... అంతా సవ్యంగా ఉంటే.. ఓ రెండు మూడు నెలల తరువాత నవదంపతులు ఒకటే ఆలోచిస్తుంటారు.  పుట్టేబిడ్డకు ఏ పేరు పెట్టాలి.. ఎలాంటి పేరు పెట్టాలి.. అందులోనూ కొంతమంది పూర్వీకుల పేరు కలసి రావానుకుంటారు.  పంచాంగం ప్రకారం.. నక్షత్రం కలవాలంటారు.  ఇవన్నీ కలసి పెట్టే పేరు వెరైటీగా అందరకు గుర్తుండిపోయేలా పెట్టుకోవాలను తెగ ఆలోచిస్తుంటారు. బిడ్డలకు నేమ్​ సెలక్షన్​ చేసే విషయంలో కొన్ని టిప్స్​ పాటిస్తే... అందరూ ఆకర్షించేలా ఉంటుంది.  ఇప్పుడు ఆ టిప్స్​ గురించి తెలుసుకుందాం. . . 

పిల్లలకు పేరు పెట్టడం అంత ఈజీ కాదు. ఎన్నోరకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. లైఫ్ పార్ట్​నర్​కు  నచ్చాలి. వాళ్ల అమ్మానాన్నలకు నచ్చాలి. పెద్దయ్యాక వాడికీ నచ్చాలి. ఇంతేనా.. పిలవడానికి ఈజీగా ఉండాలి. మంచి మీనింగ్ ఉండాలి. ట్రెండీగా ఉండాలి. రొటీన్​ గా  ఉండొద్దు. డిఫరెంట్ గా ఉండాలి. సెంటిమెంట్లను ఫుల్​ ఫిల్ చేయాలి. అబ్బో.. ఒకటా, రెండా... ఎన్నో. అందుకే పేరు పెట్టేందుకు ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లో వెతుకుతారు పేరెంట్స్. అయితే అంత కష్టం అక్కర్లేదు. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ పాపకు, బాబుకు చక్కని పేరును మీరే పెట్టుకోవచ్చు. ఇంతకీ అవేంటో చూద్దాం

ALSO READ : గురు పూర్ణిమ ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి..

అరుదైనవై ఉండాలి..

పిల్లలకు పెట్టే పేర్లు అరుదుగా విన్నవై ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి పేరు ఆ చిన్నారికి మాత్రమే ఉంది అనిపించాలి. ఇందుకోసం మరీ లోతుగా ఆలోచించనక్కర్లేదు. పేరు ఎట్టి పరిస్థితుల్లో ఫన్నీగా ఉండకూడదు. అలాంటి కామెడీ పేరు పెడితే... చిన్నారికి ప్యూచర్​ లో  చాలా ఇబ్బంది అవుతుంది.

ఆలోచించాలి..

పేరు పెట్టాక... చిన్నారి ఆ పేరుతోనే జీవితాంతం జీవించే పరిస్థితి. అందువల్ల ఒకటికి పదిసార్లు ఆలోచించి ఫైనల్ నేమ్ ఫిక్స్ చేసుకోవాలి. తెలిసినవాళ్లతో ఆ పేరు గురించి చర్చించాలి. అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా లైప్ పార్టనర్ తో చర్చించాలి.

కన్ఫ్యూజన్ ఉండొద్దు..

పెట్టిన పేరు ఎదుటివారిని కన్​ఫ్యూజ్ చేసేలా ఉండొద్దు. కొన్ని పేర్లు వింటే... అది కరెక్టు పేరేనా అనిపిస్తుంది. ఉదాహరణకు అబ్బాయికి శశి అని పెట్టకూడదు. ఎందుకంటే... శశిఅనే పేరు వినగానే అమ్మాయి అనే ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే అమ్మాయికి తరుణ్, వరుణ్ వంటి పేర్లు పెట్టకూడదు. అలా పెడతారని కాదు.ఒక్కో సందర్భంలో కొంతమంది అలా పెడుతుంటారు. అందువల్ల ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

నిక్ నేమ్ కలిస్తే మంచిది..

ఐశ్వర్యరాయ్​ ని ... నిక్​ నేమ్ గా ఐష్ అంటారు. మీ చిన్నారికి పెట్టే పేరు విషయంలో కూడా నిన్​ నేమ్ కలిసి ఉండే పేరు పెట్టాలి. ఉదాహరణకు కృష్ణ అనే పేరులో నుంచీ కొందరు క్రిష్ అని నిక్ నేమ్ పెట్టుకుంటారు. ఐతే... అసలు పేరు ఎంత బాగుంటుందో, నిక్ నేమ్ కూడా అంతే బాగుండేలా చూసుకోవాలి. ఉదాహరణకు రాజేష్ అన్న పేరుకి నిక్ నేమ్ రాజ్ అంటే బాగోదు. అది సెట్ కాదు. ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి.

రిథమిక్ గా ఉండాలి..

పేరు కూడా పలికినప్పుడు అందంగా వినిపించాలి. ఆ సౌండ్ ఎదుటివారికి నచ్చేలా ఉండాలి. ఎందుకంటే పేరంటే ఒక్క పదమే ఉండకపోవచ్చు. రాజేష్ కుమార్, దివ్య భారతి... ఇలా రెండు మూడు పదాలు కలిపి ఉండొచ్చు. అలాంటి పేరు పెట్టాలనుకుంటే... ఆ పేరు రిథమిక్ గా ఉండేలా చూసుకోవాలి. అంటే.... ఆ పేరును మొదటి నుంచీ చివరి వరకూ పలికేటప్పుడు ఎక్కడా ఎలాంటి డిస్టర్​ బెన్స్ ...చాలా ఈజీగా పలికేలా ఉండాలి. ధన్వంత్ అన్వేష్ వర్మ అనే పేరే తీసుకుంటే... ఇందులో రిథమ్ ఉంది. ధన్వంతన్వేష్ వర్మ అని ఈజీగా పలికేయవచ్చు. అదే ముకుంద్ ఖావడే విశ్వాస్ అనే పేరైతే... పలికేటప్పుడే ఏదో ఇబ్బంది అనిపిస్తుంది. అందువల్ల రిథమిక్ గా ఉందో లేదో చూసుకొని పెట్టుకోవాలి.

మిక్సింగ్ నేమ్స్..

కొత్త పేర్లు దొరకట్లేదని అనిపిస్తే రెండు మూడు పేర్లు కలిపేస్తే... కొత్త పేర్లు తయారవుతాయి. ఈశ్వర్, నాగేష్... ఈ రెండూ కలిపేసి నాగేశ్వర్ అన్నట్లుగా... మిక్సింగ్ నేమ్స్ పెట్టినా బాగుంటాయి.