గురు పూర్ణిమ ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి..

గురు పూర్ణిమ ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి..

హిందూ పురాణాల ప్రకారం  గురు పౌర్ణమి  చాలా ప్రత్యేక మైనది.  ప్రతి సంవత్సరం ఆషాఢమాసం పౌర్ణమి రోజున   జరుపుకుంటారు. ఈ రోజున పంచమ వేదం మహాభారతాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడి జన్మదినం అని  పండితులు చెబుతున్నారు.  అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. 

పంచాంగం ప్రకారం .ఈ సంవత్సరం గురుపౌర్ణమి (గురు పూర్ణిమ) జూలై 10న వచ్చింది. ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈరోజున కొంత మంది ఉపవాసం కూడా పాటిస్తారు. హిందూ మతంలో గురువును భగవంతునికి, భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తారు.

గురు పౌర్ణమి తేదీ, శుభ ముహూర్తాలు:

  • గురు పూర్ణిమ తేదీ: జూలై 10(గురువారం)
  • తిథి ప్రారంభం: జూలై 10 గురువారం  తెల్లవారుజామున 1: 37 గంటలకు ( బుధవారం అర్దరాత్రి) 
  • తిథి ముగింపు : జూలై 10 అర్థరాత్రి
  • బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4: 10 నుంచి 4: 50 వరకు
  • అభిజిత్ ముహూర్తం: ఉదయం 11: 59 నుంచి 12: 54 వరకు
  • విజయ ముహూర్తం: మద్యాహ్నం 12: 45 నుంచి 7: 41 వరకు
  • గోధూళి ముహూర్తం రాత్రి 7: 21 నుంచి 7: 41 వరకు

గురుపౌర్ణమి రోజున లోకాలకు గురువుగా వ్యవహరించబడే వ్యాస మహర్షితో పాటు.. విష్ణుమూర్తిని.. పరమేశ్వరుడిని పూజించాలని  జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా గురువును పూజించడం వలన కెరీర్‌లో పురోగతికి మార్గం సుగమం అవుతుంది. 

 

  • గురు పౌర్ణమి రోజున గురువును...  విష్ణువును పూజించిన వారు కెరీర్​ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. 
  • గురు పౌర్ణమి రోజున గీతను పారాయణం చేయాలి... గోమాతకు సేవ చేయాలి. 
  • గురువుగారి పాదాలకు పూజ చేయండి. 
  • వ్యాస పీఠాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాసుడితో పాటు... విష్ణుమూర్తి .. లక్ష్మీదేవి చిత్రపటాలకు .. పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు మొదలైన పూజా సామగ్రితో  పూజించండి. 
  • విష్ణువును పూజించేటప్పుడు, తులసి ఆకులు సమర్పించడం మర్చిపోవద్దు
  • ఆవునెయ్యితో దీపారాధన చేయండి. 
  • గురు పౌర్ణమి రోజున పసుపు ధాన్యాలు, పసుపు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్స్ దానం ఇవ్వండి. ఇది జాతకంలో గురు గ్రహాన్ని బలపరుస్తుంది.

 పురాణ ఇతిహాసాల ప్రకారం, వేద వ్యాసుడు ఆ రోజున జన్మించాడు. ఆయన వేదాలను నాలుగు భాగాలుగా విభజించి రచించారు. మహాగురువుగా పరిగణించబడే ఆ రోజు ఆయన ఆశీస్సులు పొందడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేద వ్యాసుని అనుగ్రహంతో, అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి, జ్ఞానం వస్తాయని నమ్ముతారు