Health tips: రోజూ తీసుకోవాల్సిన 8 ముఖ్యమైన విటమిన్లు..వాటి ఆరోగ్య ప్రయోజనాలు

Health tips: రోజూ తీసుకోవాల్సిన 8 ముఖ్యమైన విటమిన్లు..వాటి ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు కీలకం. రోగనిరోధక శక్తి కోసం, రోజువారీ కార్యక్రమాలకు శక్తినిస్తాయి. చర్మం ఆరోగ్యం కోసం, మానసిక స్థితి సమతుల్యత, యాంటీఆక్సిడెంట్లు, రక్తం గడ్డ కట్టాలన్నా, ఎముకలు ఆరోగ్యం కావాలన్నా విటమిన్లు తప్పనిసరి. మనం రోజూ తీసుకొని ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన 8 ముఖ్యమైన విటమిన్లు, వాటి ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుందాం. 

రోజువారీ ముఖ్యమైన విటమిన్లు

విటమిన్ ఎ..దృష్టి, చర్మం,రోగనిరోధక శక్తి కోసం - రోజువారీ విటమిన్​ఎ చాలా ముఖ్యం.. ఇది ఎక్కువగా  క్యారెట్లలో లభిస్తుంది. 
విటమిన్ బి 12.. శక్తి ,నరాల పనితీరు కోసం - మన రోజువారీ ఆహారంలో విటమిన్​ బి12 తప్పనిసరిగా ఉండాలి.  విటమిన్ బి12 ఎక్కవుగా గుడ్లలో లభిస్తుంది. 
విటమిన్ సి..రోగనిరోధక శక్తి,చర్మ ఆరోగ్యం ఉండాలంటే విటమిన్​ సి తప్పనిసరిగా - రోజువారీ ఆహారంలో ఉండాలి.నారింజ పండ్లలో, నిమ్మ పండ్లు, ఉసిరిలలో ఎక్కువగా విటమిన్​ సి లభిస్తుంది. 
విటమిన్ డి..ఎముకలు ,మానసిక స్థితి బాగుండాలంటే  విటమిన్​డి తప్పనిసరి. ఇది సూర్యకాంతి (15-20 నిమిషాలు) లభిస్తుంది. 
విటమిన్ ఇ..చర్మం ,యాంటీఆక్సిడెంట్ మద్దతు కోసం మనం రోజు తీసుకునే ఫుడ్​ ఇది కంపల్సరి ఉండాలి. బాదం పప్పులో విటమిన్​ ఇ పుష్కలంగా లభిస్తుంది.  
విటమిన్ కె..రక్తం గడ్డకట్టడం ,ఎముకల ఆరోగ్యానికి ఇది  చాలా ముఖ్యం. పాలకూర లేదా ఇతర ఆకుకూరల్లో సమృద్ధిగా ఉంటుంది. 
విటమిన్ బి 6..మెదడు పనితీరు ,జీవక్రియ కోసం విటమిన్​ బి6  బాగా పనిచేస్తుంది. అరటిపండ్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. 
విటమిన్ బి 9..కణాల మరమ్మత్తు,పెరుగుదలకు విటమిన్​ బి9 బాగా  తోడ్పడుతుంది. రోజూ మనం తీసుకునే ఆహారంలో బ్రోకలీ లేదా కాయధాన్యాలను చేర్చుకోవడం ద్వారా విటమిన్​ బి9 ను పొం దవ చ్చు.