- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల, వెలుగు : కులవృత్తులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గద్వాల మండలం సంగాల చెరువులో రెండు లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కులవృత్తులను ఆదుకోవాలనే సంకల్పంతోనే మత్స్యకారులకు ఫ్రీగా చేప పిల్లలను అందజేస్తుందని చెప్పారు. నీటి వనరులను సద్వినియోగం చేసుకొని చేప పిల్లల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్స ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఫిషరీ ఏడీ షకీలాభాను, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు పాల్గొన్నారు.
వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ..
రేలంపాడు ఆర్ అండ్ ఆర్ సెంటర్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.30 లక్షలతో 90 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పనులు ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బండారి భాస్కర్, గట్టు తిమ్మప్ప, బాబర్ తదితరులు పాల్గొన్నారు.
