Weather updates:తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

Weather updates:తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్  అలెర్ట్  జారీ

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన కారణంగా రానున్న మరో ఐదు రోజులు తెలంగాణ వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD)  తెలిపింది. నిన్న ఆగ్రేయ బంగాళాతం దాని పరిసరల్లో వాయుగుండం కేంద్రీకృతమైన ఉండగా..ఈ రోజు (అక్టోబర్26, ఆదివారం)ఆగ్నేయ బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.  వాయుగుండం ప్రస్తుతం  పోర్టు బ్లేయర్​ 620 కిలోమీటర్లు, చెన్నై తూర్పు ఆగ్నే దిశ780 కిలోమీటర్లుచ విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశలో 830 కిలోమీటర్స్​,కాకినాడకు  ఆగ్రేయ దిశలో 830 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. 

28 అక్టోబర్ 2025 సాయంత్రం సమయానికి తూర్పు వాయువ్య దిశలోనే కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరంలో మచిలీపట్నం కళింగపట్నం ల మధ్య ఇంచుమించు కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది.ఈ తీవ్ర తుఫాను తీరాన్ని దాటే సమయంలో ఈదురు గాలుల వేగము గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది.

వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. 28 వ తేదీన (మంగళవారం ) తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు 29వ తేదీ, 30తేదీనభారీ వర్షాలు  కురుస్తాయని  వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ రోజు (ఆదివారం ) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్​ ఉందని తెలిపింది. గంటలకు 30నుంచి 40 కిలోమీటర్లు తేగతంలో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు ( సోమవారం) భారీ వర్షాలు.. 

సోమవారం ( అక్టోబర్​ 27) రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 16 జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

28 తేదీన  అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. రెడ్​ అలెర్ట్​ 

తెలంగాణలోని  ఈశాన్య జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ఉందని ఐఎండీ తెలిపింది.  ఉత్తర, ఈశాన్య జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

28 తేదీన నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  ఈ జిల్లాల్లో ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం  తో హెచ్చరికలు జారీ చేసింది. 

ఆరు జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్..గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి ఖమ్మం వరంగల్ హనుమకొండ  లలో భారీ వర్షం కురిసే ఛాన్స్​ ఉంది. 

14 జిల్లాలకు భారీ వర్షాలతో ఎల్లో అలర్ట్..అదిలాబాదు, నిర్మల్, నిజామాబాద్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

29తేదీన  ఏడు జిల్లాలకు  అతి భారీ వర్షాలు..ఆరేంజ్ అలర్ట్..

 అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 

అక్టోబర్​29 తేదీన 9జిల్లాలకు భారీ వర్షాల కురిసే ఛాన్స్​ ఉండటంతో ఎల్లో అలెర్ట్   జారీ చేసింద ఐఎండీ. నిజామాబాద్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల , కరీంనగర్​ భద్రాద్రి కొత్త గూడం,మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ  జిల్లాలలో ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.  

30వ తేదీన అదిలాబాద్​, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​వాతావరణ శాఖ హెచ్చరించింది.