జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు విడుతలుగా రేవంత్ ప్రచారం చేయనున్నారు. మొదటి విడుతలో అక్టోబర్ 30, 31న నాలుగు డివిజన్లలో రేవంత్ ప్రచారం చేయనున్నారు. రెండో విడతలో నవంబర్ 4, 5 తేదీల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. రేవంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. ఇపుడు రేవంత్ ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా రేవంత్ షెడ్యూల్ ఖరారు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ సారి ఎన్నికల బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలను ప్రింట్ చేయనుంది ఈసీ. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ జరగనుంది.
