దారుణం.. పట్టపగలు వృద్దుడిపై దారుణంగా దాడి చేశాడు ఓ దుర్మార్గుడు.. తండ్రి వయస్సున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా రాడ్డుతో కొట్టాడు.. బాధతో విలవిలలాడిపోతున్నా వదల్లేదు.. దారిన పోయేవారు చూస్తున్నారే తప్పా అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు.. ఓ మహిళ సాహసించి ఆపేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా చంపేస్తానని బెదిరించాడు ఆ దుర్మార్గుడు. ఢిల్లీలోని అలిగావ్ లో పట్టపగలు ఓ వృద్ధుడిపై రాడ్డుతో ఓ యువకుడు దాడి చేసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని అలీగావ్ కు చెందిన బాధితుడు రఘరాజ్ తన కారులో ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కారును అడ్డగించిన మోహిత్, అతని గ్యాంగ్ వృద్దుడైన రఘురాజ్ ను రాడ్లతో దారుణంగా కొట్టిన సంఘటన డిల్లీలో కలకలం రేపింది.
రఘురాజ్ కారును అడ్డగించిన మోహిత్, అతని సహచరులు అతని కారు అద్దాలను పగలగొట్టి, వాహనం నుంచి బయటకు లాగి, ఎటువంటి కనికరం లేకుండా విచక్షణరహితంగా కొట్టడం ప్రారంభించారు. చుట్టుపక్కల వారు మొదట్లో చోద్యం చూసినా తర్వాత స్పందించి ఆపడానికి ప్రయత్నించారు. అయితే దుండగులు వారినికూడా బెదిరించారు. లేకుండా చంపేస్తామన్నారు.
దాడిలో రఘురాజ్ రెండుకాళ్లు విరిగాయాని పోలీసులు నిర్దారించారు. బాధితుడు నొప్పితో ఏడుస్తుంటే దాడి చేసిన వ్యక్తి రాడ్లతో కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఎందుకు దాడి చేశారు?
వ్యక్తిగా కక్షల వల్లే ఈ దాడి జరిగిందని పోలీసులు నిర్ధారించారు. రెండేళ్ల క్రితం ప్రధాని నిందితుడు మోహిత్.. అలీగావ్ లోని ఓ స్థలాన్ని కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ నిర్మాణం జరిగిన రెండు నెలలకే ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ(DDA) కూల్చివేసింది.
రఘురాజ్ ఫిర్యాదు చేయడం వల్లే తన భవనం కూల్చివేతకు దారి తీసిందని అనుమానంతో రఘురాజ్ పై దాడి చేశాడు మోహిత్. తనకు జరిగిన నష్టానికి రఘురాజ్ బాధ్యుడని ప్రతికారం తీర్చుకోవాలని కుట్రపన్నాడు మోహిత్.. శుక్రవారం అతని స్నేహితులతో కలిసి రఘురాజ్ పై దాడి చేశారు.
కేసు నమోదు, నిందితుల ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మోహిత్ ,అతని సహచరులను గుర్తించే పనిలో పడ్డారు ఢిల్లీలో పోలీసులు.
दिल्ली में एक प्लॉट विवाद को लेकर एक बुजुर्ग व्यक्ति की बुरी तरह से पिटाई कर दी गई. पिटाई का वीडियो तेजी से वायरल हो रहा है. जिसमें बुर्जुग शख्स को एक युवक अपने दोस्तों के साथ मिलकर बीच सड़क पर रॉड और डंडे से मार रहा है. ये वीडियो दक्षिण-पूर्वी दिल्ली के आलीगांव का है. pic.twitter.com/mJMac2Cbtx
— Delhi Samachar TV (@delhi_samachar) October 25, 2025
