బ్యాడ్మింటన్: ఖేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రత్న అందుకున్న సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బ్యాడ్మింటన్: ఖేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రత్న అందుకున్న సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్లు చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్టి–సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాండవీయ ‘మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రత్న’ అవార్డును అందజేశారు. గతేడాది ఈ అవార్డుకు ఎంపికైన ఈ ఇద్దరు టోర్నీ కమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా అప్పట్లో రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన వేడుకలకు హాజరుకాలేకపోయారు. ఇక ఫిబ్రవరిలో మాండవీయ నుంచి ఈ పురస్కారం అందుకోవాల్సి ఉన్నా.. సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తండ్రి కాశీ విశ్వనాథం గుండెపోటుతో మరణించడంతో కార్యక్రమం వాయిదా పడింది.

 దీంతో చాలా కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఈ అవార్డును ఎట్టకేలకు బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు గురువారం మంత్రి అందజేశారు. ‘ఈ రోజు న్యూఢిల్లీల్లో మన బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్లు చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఖేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రత్న అవార్డును అందజేశాం. ఈ పురస్కారం వారి అంకితభావం, కోర్టులో అసాధారణ ప్రదర్శనకు నిదర్శనం. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాళ్లు మరిన్ని టోర్నీల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నాం’ అని మాండవీయ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.