
శంషాబాద్, వెలుగు: తనకు బస్టాండ్ లో దొరికిన బ్యాగ్ ను పోలీసులకు అప్పగించి నిజాయతీని చాటుకుందో మహిళ. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎయిర్ పోర్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ కి చెందిన పద్మ అక్కడి బస్టండ్ లో తన బ్యాగ్ ను పొగొట్టుకుంది. దీనిపై ఆమె పోలీసులకు కంప్లయింట్ కూడా చేసింది. మోహిన్ మాహెల్ ప్రాంతానికి చెందిన హిమాది బేగం శంషాబాద్ బస్టండ్ లో తనకు దొరికిన ఓ బ్యాగ్ ను పోలీసులకు అప్పగించింది.
ఆ బ్యాగ్ లో రూ.లక్ష విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఓ సెల్ ఫోన్ ఉన్నాయి. అంతకుముందు బ్యాగ్ పోయిందని కంప్లయింట్ ఇచ్చిన పద్మ చెప్పిన వివరాలతో అది ఆమె బ్యాగ్ అని పోలీసులు నిర్ధారించి పద్మకు అప్పగించారు. తనకు దొరికిన బ్యాగ్ ను పోలీసులకు అప్పగించిన హిమాది బేగంను ఎస్సై అభినందించారు.