
- కవి, రచయిత, గాయకుడు జయరాజ్
ముషీరాబాద్, వెలుగు : బహుజన సాహిత్యమే మానవ వికాసానికి మార్గమని ప్రముఖ కవి, రచయిత, గాయకుడు జయరాజ్ పేర్కొన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర 6 వ మహాసభ ఎంఎం గౌతమ్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు జయరాజ్, అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ హాజరై మాట్లాడారు.
బహుజన సాహిత్యాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం చాలా ముఖ్యమన్నారు. పూలే, అంబేద్కర్, కాన్షీరాం, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయ లలిత, వెంకటమ్మ,నీరుడు కృష్ణ, మల్లారెడ్డి, వెంకటేశం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.