- భజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్
బషీర్బాగ్, వెలుగు: వాలెంటైన్స్ డే పేరుతో కార్పొరేట్ శక్తులు చేసే వ్యాపారాలను అడ్డుకుంటామని భజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. పాశ్చాత్య సంస్కృతి అయిన వాలెంటైన్స్ డేను దేశ యువత బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గురువారం కోఠి విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వాలెంటైన్స్ డేను నిషేధించాలని పోస్టర్ను ఆవిష్కరించారు. పుల్వామా ముష్కరుల దాడిలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలిగా ఏటా ఫిబ్రవరి 14న వీర జవాన్ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 13న కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో జవాన్లకు నివాళులర్పిస్తామన్నారు. వాలెంటైన్స్ డే పేరుతో దేశ యువత చెడు మార్గంలో వెళ్లకుండా, దేశ సరిహద్దులో ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్న సైనికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
