
హైదరాబాద్ : బేకరీలో సిగరెట్ తాగవద్దని దుకాణ యజమాని చెప్పినందుకు తాగుబోతులు వీరంగం సృష్టించారు. బేకరీ యజమానిని చితకబాదారు. షాపు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటన నేరెడ్ మెట్ కృపా కాంప్లెక్స్ లోని శ్రీబాలాజీ సాయినాథ బేకరీలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ దృష్యాలు బేకరీలోని CCTVలో రికార్డ్ అయ్యాయి. బేకరీ యజమాని నేరేడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.
దాడి చేసిన తాగుబోతులను వేంటేనే శిక్షించాలని.. జరిగిన నష్టపరిహారం ఇప్పించగలరని పోలీసులను కోరాడు బేకరీ యజమాని. CCTV పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.