
నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi ) తెరకెక్కిస్తున్న ఈ మాస్ అండ్ కమర్షియల్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నందమూరి మోక్షజ్ఞ(Nandauri Mokshagna).
భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ లోడింగ్..?
— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) August 17, 2023
గణ గణ గణేశా..!! వినాయక చవితి నాడు ?
స్పీకర్స్ పగిలిపోతాయ్?????#Bhagavanthkesari #Balayya #NandamuriBalakrishna #NBK pic.twitter.com/VjBCfB6xiN
భగవంత్ కేసరి సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. గణ గణ గణేశా(Gana Gana Ganesha) అంటూ సాగే ఈ పాటను వినాయక చవితి సంధర్బంగా రిలీజ్ చేయనున్నారట. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు నందమూరి మోక్షజ్ఞ.. భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ లోడింగ్. గణ గణ గణేశా.. వినాయక చవితినాడు స్పీకర్లు మిగిలిపోతాయి అంటూ రాసుకొచ్చారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. షైన్ స్క్రీన్(Shine screen) పతాకంపై సాహు గరికపాటి(Sahu garikapati) నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా.. లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణకు కూతురిగా కనిపించనుంది. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.