
బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో సూపర్వైజర్ ట్రైయినీ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 22.
- పోస్టుల సంఖ్య: 32
- పోస్టులు: మెకానికల్, కెమికల్, పెట్రో కెమికల్ విభాగాల్లో సూపర్వైజర్ ట్రెయినీ.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- లాస్ట్ డేట్: జులై 22 .
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు balmerlawrie.com వెబ్ సైట్ లో చూడగలరు.