సికింద్రాబాద్ ఘటనతో NSUIకి ఎలాంటి సంబంధం లేదు

సికింద్రాబాద్ ఘటనతో NSUIకి ఎలాంటి సంబంధం లేదు

ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనకు ఎన్ఎస్యూఐ కి ఎటువంటి సంబంధం లేదని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. ఉదయం నిరసనకారులు జాతీయ జెండాలు పట్టుకోవడం చూసి అందరూ ఎన్ఎస్యూఐ అనుకున్నారు. కానీ ఆ ఘటనతో మాకు సంబంధం లేదని వెంకట్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అగ్నిపత్ పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందన్నారు, ఆ విద్యార్థులు ఆవేశానికిలోనై ఈ ఘటనకు పాల్పడడం జరిగిందని వెంకట్ చెప్పారు. ఈ సంఘటనకు ఎన్ఎస్యూఐ కి ఎలాంటి సంబంధం లేదని,ఆ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెంకట్ పేర్కొన్నారు. 

ఈ వార్తలు చూసి ఎన్ఎస్యూఐ చేసిందని అనుకుంటున్నారు.. అందుకే తాను పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా ఈ వీడియో చేస్తున్నానని వెంకట్ అన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించే కార్యకలాపాలను చేయవద్దని తన తోటి విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన వెల్లడించారు. "నేను ఉదయం ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూకి వెళుతుండగా నన్ను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. తరువాత షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు" అని వెంకట్ తెలిపారు.