హైదరాబాద్, వెలుగు: ‘కేటీఆర్ నల్ల అంగీ వేసుకొని ధర్నా చౌక్ లో నిరసన తెలిపితే గతంలో ఆయన గ్లోబరీనా ద్వారా చేసిన తప్పులు.. ఒప్పయితయా..? ’ అని విప్ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్...నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు.. నీకు గ్లోబరీనాతో సంబంధం ఉందా.. లేదా?’ అని నిలదీశారు.
ఆనాడు బ్లాక్ లిస్టులో ఉండాల్సిన సంస్థకు, కేసులు నమోదైన సంస్థకు టెండర్ ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. నిధుల విడుదల విషయంలో ఆనాటి విద్యా శాఖ మంత్రిపై, అధికారులపై మీరు ఒత్తిడి తెచ్చింది నిజం కాదా..? చెప్పాలన్నారు. దేశంలోని విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే.. ఇన్ని రోజుల తర్వాత నిరసనలో పాల్గొనడం ఏంటన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో బీఆర్ఎస్ హయాంలో మన రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న విషయాన్ని విప్ వెంకట్ గుర్తు చేశారు.
