ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు అంట.. !

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు అంట.. !

ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఇద్దరు అమ్మాయిల ఫోటోలను విడుదల చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నది ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు 24 ఏళ్ళ అసిఫా, 17 ఏళ్ళ మాంగల్ గా గుర్తించారు పోలీసులు. ఈ ఆత్మాహుతి దాడిలో 17 మంది భద్రతా సిబ్బందితో సహా సుమారు 50 మంది మరణించారు. బలూచిస్తాన్ దాడిని సీరియస్ గా తీసుకున్న పాక్ ఇప్పటికే 140 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు 40 గంటల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇద్దరు మహిళలు పాల్గొన్నారని.. మెంగల్ అనే వ్యక్తి మహ్మద్ ఇస్మాయిల్ కుమార్తె అని.. బలూచిస్తాన్‌లోని నుష్కి నివాసి అని పేర్కొంది BLA . మెంగల్ తన 21వ పుట్టినరోజున BLA యొక్క మజీద్ బ్రిగేడ్‌లో చేరిందని... మెంగల్ 2024 జనవరిలో 'ఫిదాయీ' (ఆత్మాహుతి దాడి) కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

అసిఫా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని... దాడికి ముందు ఆమె తన BLA సహచరులతో కలిసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తున్నట్లు ఒక వీడియో సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేతకు గురైన మహిళలపై మాత్రమే అధికారాన్ని ప్రదర్శిస్తోందని.. మనల్ని నేరుగా ఎదుర్కోలేదని..అందుకు వారి సామర్థ్యం సరిపోదని అంటోందని అసిఫా. ఆ వీడియోలో అసిఫా తుపాకీ పట్టుకొని బిగ్గరగా నవ్వుతోంది.