బిగ్​‘సి’ లక్కీ డ్రా ఆఫర్​కు అద్భుత స్పందన

బిగ్​‘సి’ లక్కీ డ్రా ఆఫర్​కు అద్భుత స్పందన

హైదరాబాద్​, వెలుగు: మొబైల్​ రిటైల్​ చెయిన్​ బిగ్​‘సి’ తన 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్​కు అద్భుత స్పందన వచ్చిందని సంస్థ ఫౌండర్​ ఎం..బాలుచౌదరి చెప్పారు. ఆఫర్​లో​ భాగంగా మూడు లక్కీడ్రాలు ఉంటాయి. విజేతలకు 20 మారుతి సుజుకీ ఆల్టో కార్లు, 20 బజాజ్​ ప్లాటినా బైక్స్​, 20 ఫ్రిజ్​లు, 20 ఏసీలు, 20 టీవీలను బహుమతులుగా ఇస్తారు. ఆఫర్​ వచ్చే నెల 29 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం మొదటి డ్రా విజేతల పేర్లను ప్రకటించారు. ఆరుగురికి కార్లు, ఆరుగురికి బైక్స్​,ఆరుగురికి ఫ్రిజ్​లు, ఆరుగురికి ఏసీలు, ఆరుగురికి టీవీలు ఇస్తారు. ప్రతి మొబైల్​, టీవీ, ల్యాప్​టాప్​కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది. రూ.మూడు వేల వరకు ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ ఇస్తారు. కిస్తీల్లో పద్ధతిలో వడ్డీ, డౌన్​పేమెంట్​ లేకుండానే మొబైల్​ కొనుక్కోవచ్చు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ మొబైల్​రిటైల్​రంగంలోనే మొదటిసారిగా యాక్ససరీస్​పై కూడా కచ్చితమైన బహుమతి ఇస్తున్నామని చెప్పారు. బ్రాండును బట్టి ఫోన్లపై రూ.మూడు వేల నుంచి రూ.10 వేల వరకు క్యాష్​బ్యాక్​ ఇస్తున్నామని వెల్లడించారు. గోపాల కృష్ణ అనే కస్టమర్​తోపాటు మరో ఐదుగురు కార్లను గెలుచుకున్నారని చెప్పారు.